Business Ideas: టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు..డబ్బులు లెక్కపెట్టడం వస్తే చాలు..నెలకు రూ. 1 లక్ష మీవే..

First Published | Sep 4, 2023, 12:26 PM IST

రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనే చెప్పాలి.  ఎందుకంటే ప్రజలు నిత్యం ఏదో ఒక సందర్భంలో తమ దుస్తులను కొనుగోలు చేస్తూనే ఉంటారు రెడీమేడ్ దుస్తులను ప్రస్తుత కాలంలో అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ధర తక్కువగా ఉండటం తో పాటు రెడీమేడ్ దుస్తులు వెంటనే ఉపయోగించవచ్చు. అందుకే రెడీమేడ్ దుస్తులకు చాలా డిమాండ్ ఉంటుంది. 

 మీరు కూడా రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి వ్యాపారం ఎలా చేయాలి? ఎలాంటి వ్యాపార  జాగ్రత్తలు పాటించాలి.  వంటి అనేక విషయాలను ఇప్పుడు మనం చర్చిద్దాం.  రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ముఖ్యంగా మూడు విభాగాల్లో కొనసాగుతుంది. రెడీమేడ్ దుస్తుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లల వంటి విభాగాల్లో కొనసాగుతుంది.  రెడీమేడ్ దుస్తుల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్ లభిస్తుంది.  మీరు దుస్తులను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ తో మీకు సంబంధం లేదు. హోల్ సేల్ మార్కెట్లో  మీరు దుస్తులను కొనుగోలు చేసి వాటిని రిటైల్ గా విక్రయిస్తే సరిపోతుంది. 
 

 రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని మీరు అతి తక్కువ పెట్టుబడి తో కూడా ప్రారంభించవచ్చు.  అదేవిధంగా మీరు పెద్ద మొత్తంలో పెట్టాలంటే భారీ ఎత్తున కూడా ప్రారంభించవచ్చు.  మీరు కనీసం 50 వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.   మీరు గ్రామంలో నివసిస్తున్నట్లయితే తక్కువ పెట్టుబడితో చిన్న దుకాణంలో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.  ఒక చిన్న తరహా పట్టణంలో మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఓ మధ్యతరహా దుకాణంలో వ్యాపారం ప్రారంభించవచ్చు. 


 రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీకు లాభం మార్జిన్ దుస్తుల క్వాలిటీ లభిస్తుంది. . బ్రాండెడ్ దుస్తులపై మీకు కొద్దిగా తక్కువ మార్జిన్ లభిస్తుంది. . ఎంత తక్కువ మార్జిన్ లభించిన కనీసం 30% నుంచి 50% వరకు మీకు లాభం వస్తుంది.  రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ముఖ్య వ్యాపార సూత్రం ఏమిటంటే,  ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్లను ఫాలో అవుతూ ఉండాలి యువత ఎక్కువగా ఇష్టపడే డిజైన్లను దుస్తులను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి.  అప్పుడే ఈ వ్యాపారంలో చక్కగా రాణించగలం.  ఆషాడమాసం,  డిసెంబర్ నెల  ఇలా ప్రత్యేక సందర్భాల్లో  మీ లాభం మార్చిన తగ్గించుకొని క్లియరెన్స్ సేల్ చేయడం ద్వారా మీ షాప్ కు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. 

ఇక మీరు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో కిడ్స్ వేర్ అంటే చిన్నపిల్లల దుస్తుల విభాగంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లల కోసం పెద్దవాళ్లు నిత్యం దుస్తులను కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎదిగే పిల్లలు ప్రతి ఏడాది కొత్త దుస్తులను కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత సంవత్సరం దుస్తులు ఈ ఏడాది వారికి సరిపడవు. కావున కిడ్స్ వేర్ విభాగంలో మీకు మంచి సేల్స్ లభించే అవకాశం ఉంది.

ఇక రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీరు ప్రతి నెల మీ సేల్స్ ను బట్టి  లాభం పొందే అవకాశం ఉంది.  ఉదాహరణకు మీరు 50 వేల రూపాయల సరుకు విక్రయించినట్లయితే.  1 లక్ష రూపాయల  ఆదాయం పొందే అవకాశం ఉంది. 

గమనిక:  పైన పేర్కొన్నటువంటి విషయం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏషియానెట్ తెలుగు న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.  మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. 
 

Latest Videos

click me!