Gold Rate: శ్రావణ మాసంలో బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 3000 తగ్గింది..ఇంకెందుకు ఆలస్యం పండగ చేసుకోండి..

First Published | Aug 21, 2023, 1:07 PM IST

భారతీయ మహిళలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలు బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రావణమాసంలో లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. దీంతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని కూడా అనుకుంటారు. ఈ నేపథ్యంలో బంగారు ధరలు ప్రస్తుతం ఎందుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 శ్రావణమాసంలో బంగారు నగలు కొనుగోలు చేయాలంటే ముఖ్యంగా బంగారం ధర గురించి,  ప్రత్యేకంగా తెలుసుకుంటే మంచిది. . ఎందుకంటే బంగారం ధరలు మార్కెట్ తో ముడిపడి ఉంటాయి.  ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారత మార్కెట్ పైన కూడా ప్రభావం చూపిస్తాయి.  ముఖ్యంగా అమెరికాలో  బులియన్ మార్కెట్ ట్రేడింగ్,  బంగారు ధరలపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. 
 

ఇక తాజాగా గమనించినట్లయితే అమెరికాలోని బంగారం మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర అంటే 31 గ్రాముల ధర 1880 డాలర్లుగా ఉంది.  గతంతో పోల్చినట్లయితే ఈ ధర సుమారు 10 డాలర్లు తగ్గింది.  ఈ నెల ప్రారంభంలో బంగారం ధర ఒక ఔన్సు 1950 డాలర్ల వరకూ ఉంది.  ఇక బంగారం ధర అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడంతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.  డాలర్ పుంజుకోవడంతోపాటు.  అమెరికా ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  ఫలితంగా అమెరికా పెట్టుబడిదారులు  బంగారంపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం లేదు. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి బంగారం ధరలు తగ్గిపోతున్నాయి. 


మే నెలలో గమనించినట్లయితే బంగారం ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి ఆ సమయంలో బంగారం ధర ఏకంగా 2050 డాలర్లు  పలికింది.  అక్కడి నుంచి బంగారం ప్రస్తుతం 1880 డాలర్లకు పడిపోయింది అంటే సుమారు 170 డాలర్లు తగ్గింది. ఈ లెక్కన చూసినట్లయితే బంగారం ధర భారీగా పతనమైన చెప్పవచ్చు.  అయినప్పటికీ మన దేశీయంగా మాత్రం బంగారం ధరలు పెద్దగా తగ్గడం లేదు.  మే నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  62000 దాటింది.  ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 59 వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది.  ఈ లెక్కన చూసినట్లయితే గరిష్ట స్థాయి కన్నా 3000 రూపాయలు తగ్గింది . 
 

అయితే అంతర్జాతీయ ట్రెండుతో పోల్చినట్లయితే బంగారం ధరలు దేశీయంగా చాలా తక్కువగానే తగ్గుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు మన దేశీయంగా బంగారానికి డిమాండ్ అత్యధికంగా ఉంటుంది.  అలాగే కేంద్ర ప్రభుత్వం విధించే సుంకాలు కూడా  దీనికి తోడవుతాయి. ఫలితంగా బంగారం ధర పెరుగుతుంది. అయితే  అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ప్రస్తుతం మార్కెట్లో  భారీగా తగ్గుతూ  వచ్చే అవకాశం ఉంది.  ఇదే కనుక జరిగినట్లయితే పసిడి ధరలు దేశీయ మార్కెట్లో రూ. 55000 పడిపోయే అవకాశం ఉంది. 

శ్రావణ మాసంలో బంగారానికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. మరోవైపు ధరలు కూడా తగ్గడంతో నగల షాపుల వారికి ఇది ఒక రకంగా పండగే అని చెప్పాలి. అంతే కాదు శ్రావణమాసంలో బంగారు నగల దుకాణాల వారు అత్యధికంగా  ఆఫర్లను పెట్టు మరి నగలను విక్రయిస్తూ ఉంటారు.  ఈ నేపథ్యంలో బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అయితే ప్రస్తుత రేంజ్ వద్ద బంగారం ధర ఎంత తగ్గితే అంతా మీ పోర్టుఫోలియోలో ఆడ్ చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.  
 

Latest Videos

click me!