ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి
నిబంధనల ప్రకారం డెలివరీ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలి కానీ రెండు పార్టీలు అంగీకరిస్తే పొడిగించవచ్చు. ఈ ప్రక్రియ కింద, ఈ కేసులో కూడా కొనుగోలు తేదీని పొడిగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రెగ్యులేటరీ అనుమతులు ఇంకా రాలేదని, అయితే త్వరలోనే పూర్తి చేస్తామని ఓ అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఈ ప్రక్రియ జనవరి నాటికి పూర్తవుతుందని పేరు తెలపనీ అధికారి తెలిపారు.
18 వేల కోట్ల డీల్
ఎయిర్ ఇండియాను రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు ప్రభుత్వం టాటా సన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ డీల్‌కు బదులుగా టాటా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నగదును ఇస్తుంది అలాగే ఎయిర్‌లైన్‌కు రూ.15,300 కోట్ల రుణ బాధ్యత ఉంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ డీల్ కింద ప్రభుత్వం నగదు మొత్తాన్ని పొందుతుంది.