మీరు పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తెలుసుకోండి.. లేదంటే ?

First Published Dec 28, 2020, 11:10 AM IST

మీరు ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇంటర్నెట్‌లో చాలా నకిలీ వెబ్‌సైట్లు దర్శనమిస్తున్నాయి. ఇవి అధికారిక పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ లాగానే ఉంటాయి, కానీ వాస్తవానికి అవి నకిలీవి. ఈ వెబ్‌సైట్లు ప్రజలను మోసాలకి గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో పాస్‌పోర్ట్ విభాగం చాలా కాలంగా పాస్‌పోర్టుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న అనేక నకిలీ సైట్ల పేర్లను వెల్లడించింది. ఈ కొత్త నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లకు మీరు దూరంగా ఉండడం, వాటి గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది.  
 

http:www.passport-seva.in ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా మీ వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా హ్యాకర్లు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడం వల్ల, కొన్ని వైరస్లు మీ ఫోన్‌లోకి చేరే అవకాశం ఉంది.
undefined
https:www.indiapassport.org ఈ సైట్ ని సందర్శించి మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ డేటా లీక్ కావడంతో పాటు మీరు లక్షల రూపాయలు కోల్పోయే అవకాశం ఉంది.
undefined
https:www.passport-india.in ఇది కూడా నకిలీ వెబ్‌సైట్. దీని ద్వారా మీ డేటా లీక్ కావోచ్చు. ఇలాంటి సైట్ సందర్శించడం ఎంతో ప్రమాదం.
undefined
నకిలీ పాస్ పోర్ట్ వెబ్ సైట్లుwww.applypassport.orgwww.online passportindia.comwww.passport.india-orgwww.onlinepassportindia.comwww.passportsava.inwww.mpassportsava.inwww.inditab.com
undefined
ప్రభుత్వ పాస్ పోర్ట్ వెబ్ సైట్ www.passportindia.gov.in అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సైట్ పూర్తిగా సురక్షితం, ఇది అధికారిక వెబ్‌సైట్.
undefined
వెబ్‌సైట్ ద్వారా కాకుండా, మీరు యాప్ ద్వారా కూడా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు ఎంపాస్‌పోర్ట్ సేవా. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ ప్లాట్‌ఫామ్‌ల కోసం అందుబాటులో ఉంది. మీరు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
undefined
click me!