Citroën C3కి చెందిన Puretec 82 లైవ్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కారు బేస్ మోడల్. దీని ప్రారంభ ధర రూ . 6,16,000 (ఎక్స్-షోరూమ్). మీ వద్ద రూ. 70,000 బడ్జెట్ ఉంటే మీరు ఈ కారు నెలవారీ EMI చెల్లించగలిగితే, ఆన్‌లైన్ ఫైనాన్స్ ప్లాన్ కాలిక్యులేటర్ ప్రకారం, బ్యాంక్ దీని ఆధారంగా రూ. 6,24,545 రుణాన్ని పొందే వీలుంది. దానిపై వడ్డీ వసూలు చేస్తారు. వార్షిక రేటు 9.8 శాతంగా ఉండే అవకాశం ఉంది. ( బ్యాంకును బట్టి వడ్డీ రేటు మారవచ్చు)