ముందుగా రైల్వే శాఖ ప్రకారం, టిక్కెట్టు తీసుకోకుండా రైలులో ప్రయాణించడం చట్ట ప్రకారం నేరం. కానీ, అత్యవసర పరిస్థితుల్లో ప్లాట్‌ఫారమ్ టికెట్ లేదా జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు.
ముందుగా మీరు స్టేషన్ నుండి కేవలం 10 రూపాయలకే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత రైలు ఎక్కి టీటీఈని కలవండి. మీరు మీ అత్యవసర పరిస్థితి గురించి TTEకి చెప్పండి ఇంకా మీరు ఎక్కడికి వెళ్లాలి అనే దాని గురించి అతనికి సమాచారం ఇవ్వండి. మీ రిక్వెస్ట్ విన్న తర్వాత TTE ట్రైన్ లో ఎక్కడైనా సిటు ఖాళీ ఉంటె ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ టిక్కెట్ మీకు సిద్ధం చేసి కేటాయించవచ్చు.