బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్: నేటి నుండి బ్యాంకులకు వరుస సెలవులు.. ఈ తేదీలు గుర్తుంచుకోండి

First Published Dec 25, 2021, 8:07 PM IST

ఈ సంవత్సరం చివరి నెల అంటే డిసెంబర్ ముగియడానికి కేవలం మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ బ్యాంకుకు సంబంధించిన పనులను త్వరగా పరిష్కరించవలసి ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు నుండి డిసెంబర్ 31 వరకు అంటే ఆరు రోజుల పాటు బ్యాంకులు(banks) మూసివేయనున్నారు. 

అంటే బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం  ప్రారంభం నుండి అంటే 2022 జనవరిలో మొత్తం 14 రోజులు బ్యాంక్ సెలవులు రానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను ఒకసారి చెక్ చేయడం అవసరం.

రాష్ట్రాలలో  సెలవులు
ఆర్‌బి‌ఐ బ్యాంక్ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం నేడు డిసెంబర్ 25 క్రిస్మస్ మినహా  కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి బ్యాంకులకు ఐదు రోజుల సెలవులు ఉంటాయి. అయితే వీటిలో చాలా సెలవులు స్థానికంగా ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు అలాగే ప్రాంతాల ప్రకారం బ్యాంకు సెలవులు కూడా విభిన్నంగా ఉంటాయి. ఆర్‌బి‌ఐ  బ్యాంక్ హాలిడే లిస్ట్ కూడా వివిధ రాష్ట్రాల ప్రకారం వివిధ సెలవుల వివరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులకు రెండవ, నాల్గవ శనివారాలు కూడా సెలవులు ఉంటాయి, వీటి కారణంగా సెలవుల సంఖ్య మరింత పెరుగుతుంది. 

 ఈ ఐదు రోజులలో బ్యాంకులు మూసివేయబడతాయి
25 డిసెంబర్    క్రిస్మస్ - 4వ శనివారం (బెంగుళూరు, భువనేశ్వర్ మినహా అన్ని ప్రదేశాలలో బ్యాంకులు మూసివేయబడతాయి) 
26 డిసెంబర్    ఆదివారం (వీకెండ్  సెలవు)
27 డిసెంబర్    క్రిస్మస్ సెలెబ్రేషన్స్ (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి)
30 డిసెంబర్    యు కియాంగ్ నోంగ్‌బాహ్  ( షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి)
31 డిసెంబర్    న్యూ ఇయర్స్ ఈవినింగ్ (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి)
 

జనవరి 2022లో 14 రోజుల పాటు బ్యాంక్ సెలవులు

జనవరి           
1వ తేదీ              శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా నూతన సంవత్సర దినోత్సవం హాలిడే 
2వ తేదీ               ఆదివారం కాబట్టి  దేశవ్యాప్తంగా వీకెండ్ హాలిడే 
3వ తేదీ              సోమవారం సిక్కింలో నూతన సంవత్సరం హాలిడే 
4వ తేదీ             మంగళవారం సిక్కింలో లాసంగ్ పండుగ సెలవు
9వ తేదీ             ఆదివారం ఇంకా దేశవ్యాప్తంగా గురు గోవింద్ సింగ్ జయంతి 
11వ తేదీ            మంగళవారం మిజోరంలో మిషనరీ డే కాబట్టి హాలిడే 
12వ తేదీ            బుధవారం స్వామి వివేకానంద జయంతి
14 వ తేదీ          శుక్రవారం మకర సంక్రాంతి సెలవు
15వ తేదీ           శనివారం పొంగల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులో సెలవు
16వ తేదీ            ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ సెలవు
23వ తేదీ            ఆదివారం ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి 
25వ తేదీ           రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో సెలవు
26వ తేదీ            బుధవారం గణతంత్ర దినోత్సవం హాలిడే
31వ తేదీ            సోమవారం అస్సాంలో బ్యాంకులు బంద్

click me!