Cheapest EV bike: చవక ధరకే ఏథర్ ఈవీ బైక్.. ఇలా అయితే ఓలాకు కష్టమే

Published : Dec 19, 2025, 09:59 AM IST

Cheapest EV bike: ఈవీ బైకులు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఏథర్, ఓలా వంటివి. ఇక ఏథర్ ఎనర్జీ, రిస్టా మోడల్స్ విజయం సాధించాయి. ఇప్పుడు ఏథర్ నుంచి అతి తక్కువ ధరకే మరో కొత్త బైక్ వచ్చేస్తోంది. 

PREV
13
చవకైన ఈవీ బైక్ వచ్చేస్తోంది

మనదేశంలో ఎలక్ట్రిక బైకులు కొనే వారి సంఖ్య అధికంగా ఉంది. అందుకే ఈవీ మార్కెట్ భారీగా పెరిగిపోతోంది. ఈ పోటీలో ఏథర్ మరింత ముందుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సంస్థ చవక ధరకే మరో బైకును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీని పేరు ఏథర్ ఎనర్జీ. ఇది ఓలాకు సవాలుగా నిలిచే ఈవీ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. దీని కోసం ఏథర్ డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది.

23
ఏథర్ రిస్టా విజయం

ఏథర్ రిస్టా విజయంతో ఏథర్ బైకులను కొనేవారు ఎక్కువైపోయారు. ఇది తమ మార్కెట్ వాటాను బాగా పెంచుకుంది. ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగించేందుకు చాలా తెలివిగా తక్కువ ధర మోడల్‌తో మార్కెట్లోకి రాబోతోంది. ఈ కొత్త స్కూటర్ రిస్టా కన్నా చాలా తక్కువ ధరకే రానుంది. 

33
వచ్చే ఏడాది వస్తున్న కొత్త స్కూటర్

ఈ కొత్త స్కూటర్ 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్‌లో ఇది రిస్టాను పోలి ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్, సింపుల్ బాడీ ప్యానెల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఒకే ఛార్జ్‌పై సుమారు 150 కి.మీ రేంజ్ ఇవ్వొచ్చని అంచనా.

ఏథర్ ఎనర్జీ కంపెనీని 2013లో బెంగళూరులో ప్రారంభమైంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే కంపెనీ. పర్యావరణానికి మేలు చేసేలా పెట్రోల్ అవసరం లేకుండా స్కూటర్లు తయారు చేస్తుంది. అంతేకాదు బైక్ కు టచ్ స్క్రీన్ డిస్ ప్లే, మ్యాప్స్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, వేగంగా బ్యాటరీ ఛార్జ్ కావడం వంటి సదుపాయాలతో వచ్చింది. అందుకే ఇది ఎంతో మంది ఫేవరేట్ గా మారింది. దీన్ని ఇంట్లో కూడా ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories