ఎలా పొందాలి?
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది. అర్హత, ఆసక్తి గల వ్యక్తులు అంతోదయ సరళ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం నివాస ధృవీకరణ డాక్యుమెంట్, ఆధార్ కార్డు, ఫ్యామిలీ గుర్తింపు కార్డు, జీవిత భాగస్వామి/భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అవివాహిత సర్టిఫికెట్, ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అవసరం. అయితే ఈ పథకాన్ని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ పథకం బెనిఫిట్స్ హర్యానా రాష్ట ప్రజలకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.