మళ్లీ అమెజాన్ ఉద్యోగుల తొలగింపు! ఉద్యోగాలు కోల్పోతున్న వారికీ షాకింగ్ మెసేజ్!

First Published | Oct 9, 2023, 11:57 AM IST

అమెరికా ఇంకా ఇతర దేశాలలో అమెజాన్   కమ్యూనికేషన్ విభాగాలు తొలగింపులను ఎదుర్కొంటున్నట్లు నివేదించబడింది. “అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో అండ్ మ్యూజిక్  కమ్యూనికేషన్స్ విభాగాలలో 5 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఈ చర్యతో ప్రభావితమైనట్లు తెలిపింది.
 

ఈ తొలగింపులు అమెజాన్   కంపెనీ  గ్లోబల్ కమ్యూనికేషన్స్ వర్క్‌ఫోర్స్‌లో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. "మేము మా టీమ్స్ నిర్మాణాన్ని మూల్యాంకనం చేస్తున్నాము, వ్యాపార అవసరాల ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నాము. ఇటీవలి మూల్యాంకనాన్ని అనుసరించి మా కమ్యూనికేషన్‌ల టీం  నుండి తక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి మేము కఠినమైన నిర్ణయం తీసుకున్నాము" అని అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లేసర్ చెప్పారు.

"ప్రభావిత ఉద్యోగుల సహకారానికి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, వారి నెక్స్ట్  దశలలో  సపోర్ట్  ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాము." అని పేర్కొంది. 

బాధిత ఉద్యోగులకు 60 రోజుల పాటు జీతం  ఇతర ప్రయోజనాలు అందుతాయి. దీని కోసం  ఎంప్లాయిమెంట్ సపోర్ట్ తో  సహా బెనిఫిట్స్  ప్యాకేజీని అందిస్తారు. ఇంతకుముందు అమెజాన్ నవంబర్ 2022లో ఫస్ట్ రౌండ్ తొలగింపుల చర్య తీసుకుంది.
 


నవంబర్ 2022 నుండి జనవరి 2023 మధ్య అమెజాన్ దాదాపు 18,000 మందిని తొలగించింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి   9,000 మందిని తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, యాడ్స్  అండ్ ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్‌లోని ఉద్యోగులు  ఉద్యోగాలను కోల్పోయారు. ఏప్రిల్‌లో అమెజాన్ స్టూడియోస్‌లో సుమారు 100 మంది ఉద్యోగులు ఇంకా  ప్రైమ్ వీడియోలో దాదాపు 7,000 మంది ఉద్యోగులు తొలగించబడ్డారు.
 

Amazon మార్చి 2022లో Amp అనే లైవ్ రేడియో యాప్‌ను ప్రారంభించింది. అయితే కంపెనీ ఖర్చు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా Ampని మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అమెజాన్ మ్యూజిక్  వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ బూమ్ ఈ సమాచారాన్ని ధృవీకరించారు.

"ఈ నిర్ణయం వెంటనే లేదా ఈజీగా తీసుకోబడలేదు" అని స్టీవ్ బూమ్ పేర్కొన్నాడు. "అమెజాన్  ఫ్యూచర్ పెట్టుబడులను నెలల తరబడి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది" అని ఆయన చెప్పారు.

Latest Videos

click me!