అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025: భారీ డిస్కౌంట్లు.. గాడ్జెట్‌లపై 90% వరకు తగ్గింపు !

First Published | Jan 12, 2025, 11:08 AM IST

Amazon Great Republic Day Sale 2025: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కు సిద్ధంగా ఉండండి! iQOO 13, OnePlus Nord 4, iPhone 15 వంటి టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లతో పాటు పలు వస్తువులపై 90 శాతం వరకు తగ్గింపులను అమెజాన్ ప్రకటించింది.

Amazon

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13, 2025 నుండి ప్రారంభం కానుంది. అయితే, ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే జనవరి 12 నుంచి ఈ సేల్ అందుబాటులో వుంటుంది.  ఈ సేల్ సమయంలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ టాప్-స్మార్ట్‌ఫోన్‌లతో పాటు చాలా వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కొన్ని వస్తువులపై 90 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. 

మీరు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ సేల్ సమయంలో Samsung, Apple, OnePlus, ఇతర టాప్ బ్రాండ్‌లు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. 
 

అమెజాన్ సూపర్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ 

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 లో  కొన్ని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ డీల్‌లను ప్రకటించింది. కానీ ఈ సేల్ ఎప్పటివరకు ఉంటుందో ఇంకా చెప్పలేదు. iQOO 13 వంటి హై-ఎండ్ మోడల్‌ల నుండి OnePlus Nord 4 వంటి ప్రసిద్ధ మిడ్-రేంజ్ ఫోన్‌ల వరకు అనేక ప్రజాదరణ పొందిన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తామని అమెజాన్ హామీ ఇచ్చింది.

అమెజాన్ గణతంత్ర దినోత్సవ సేల్‌లో అతిపెద్ద డిస్కౌంట్లతో అందించబడే స్మార్ట్‌ఫోన్‌లను గమనిస్తే.. వీటిలో Redmi A4, Samsung Galaxy S23 Ultra, Oppo F27 Pro+, OnePlus 13 Neo, OnePlus 13, iPhone 15, iQOO Z9s, OnePlus Nord 4, OnePlus 13R  సహా పలు ఫోన్లు ఉన్నాయి.


OnePlus 13, OnePlus 13R బిగ్ డిస్కౌంట్

OnePlus 13 సిరీస్ ను ఆ కంపెనీ రెండు రోజుల క్రితం భారత్ లో విడుదల చేసింది. అమెజాన్ సేల్ ఆఫర్‌లో ఈ డివైస్ లను మీరు కొనుగోలు చేయవచ్చు. వన్ ప్లస్ 13 మోడల్ ధర రూ. 72,999 కాగా, ప్రస్తుతం అమెజాన్ లో 69,999 సేల్ ధరకు కు అందుబాటులో ఉంది.

OnePlus 13 కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.5,000 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని కార్డులపై 2099 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఇక OnePlus 13R కొనుగోలు చేసేవారు రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. 13R అమెజాన్ లో రూ.42,999 సేల్ ధరకు అందుబాటులో ఉంది. అయితే, మీకు ఇతర ఆఫర్లు కలుపుకుని రూ. 39,999 ధరకు పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. 

అమెజాన్ టీజర్‌లలో ఒకదాని ప్రకారం iPhone 15 ధర రూ.60,000 కంటే తక్కువగా ఉంది. అదే స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.60,499కి లభిస్తోంది. ప్రస్తుతం సేల్ లో మీకు ఇది రూ.55,499 కే లభిస్తుంది. iPhone 16 సిరీస్‌పై కూడా డిస్కౌంట్ ఉంటాయని ప్రకటించింది. 

128GB స్టోరేజ్‌తో iPhone 16 రెగ్యులర్ ఎడిషన్ ధర రూ.73,490. ఈ స్టోరేజ్ వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.79,900. కాబట్టి, మీకు రూ.6,410 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనిపై మరింత తగ్గింపులు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.

Redmi Note 14 5G

రూ. 15,000లోపు కొనుగోలు చేయడానికి టాప్ 5 ఫోన్‌లు ఇలా ఉన్నాయి

Samsung Galaxy M35 అసలు ధర రూ. 16,999, ఈ సేల్ సమయంలో మీరు రూ. 13,999 తగ్గింపు ధరతో ఫోన్‌ని పొందవచ్చు. Amzaon రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా, Realme Narzo 70 Turbo రూ. 14,499 వద్ద అందుబాటులో ఉంది. Redmi Note 13 Pro వాస్తవానికి రూ. 19,279కి విక్రయించబడింది, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో రూ. 15,000 లోపు లభిస్తుంది. 

Realme Narzo N65 కూడా గొప్ప తగ్గింపును అందించడానికి సిద్ధంగా ఉంది, ఎందుకంటే ఈ సేల్ సమయంలో ఫోన్ 10,249 రూపాయల తగ్గింపు ధరకు వస్తోంది. ఈ సేల్ సమయంలో Samsung Galaxy M15 Prime Edition తగ్గింపు ధరతో రూ. 10,499కు వస్తుంది.  రెడ్ మీ నోట్ 14 ధర 21,999 కాగా, ఈ సేల్ లో మీకు ఆఫర్లతో కలుపుకుని 17,999కే లభిస్తుంది.

Latest Videos

click me!