చెలామణిలో ఉన్న కరెన్సీ (CiC)లో బ్యాంకు నోట్లు, నాణేలు ఉంటాయి. ప్రస్తుతం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 డినామినేషన్లలో బ్యాంకు నోట్లను జారీ చేస్తుంది.
మార్చి 2020 చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉంది, ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం. మార్చి 2021 నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు లేదా 2 శాతానికి క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు లేదా 1.6 శాతానికి పడిపోయింది.