హీరో స్ప్లెండర్దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం హీరో స్ప్లెండర్. గత ఏడాది డిసెంబర్‌లో ఈ బైక్ మొత్తం 1,94,930 యూనిట్లను విక్రయించింది. అలాగే 2019 డిసెంబర్‌లో 1,93,726 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలు 2019 తో పోలిస్తే 2020 డిసెంబర్ వరకు 1 శాతం పెరిగాయి.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో స్ప్లెండర్ తర్వాత హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నిలిచింది. 2020 డిసెంబర్‌లో ఈ బైక్ 1,41,168 యూనిట్లు అమ్మకాలు చేసింది. అదే 2019 డిసెంబర్‌లో 38,951 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 తో పోలిస్తే 2020 డిసెంబర్‌లో దీని అమ్మకాలు 2 శాతం పెరిగాయి.
హోండా యాక్టివాబైక్‌లతో పాటు స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా అగ్రగామిగా ఉంది. యాక్టివా 2020 డిసెంబర్‌లో 1,34,077 యూనిట్లను విక్రయించింది. 2019 డిసెంబర్‌లో 51,31,899 యూనిట్లను విక్రయించింది. 2019 డిసెంబర్‌తో పోలిస్తే 2020 డిసెంబర్‌లో దీని అమ్మకాలు కూడా 2 శాతం పెరిగాయి.
బజాజ్ పల్సర్ఈ జాబితాలో బజాజ్ పల్సర్ 4వ స్థానంలో ఉంది. బజాజ్ పల్సర్ 2020 డిసెంబర్‌లో 75,421 యూనిట్లను విక్రయించింది. అలాగే 2019 డిసెంబర్‌లో 50,931 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 డిసెంబరులో ఈ బైక్ అమ్మకాలు 48 శాతం పెరిగాయి.
టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో 59,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్‌లో 45,669 యూనిట్లను విక్రయించింది. 2020 డిసెంబర్‌లో దీని అమ్మకాలు 31 శాతం పెరిగాయి.