మేక్ ఇన్ ఇండియా పథకం కింద కార్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తేనే ఆటోమొబైల్ కంపెనీలు మనుగడ సాగిస్తాయి. అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మితే ఆటోమొబైల్ కంపెనీలకే ఎక్కువ లాభం ఉండకపోవచ్చు. ఇందుకు పన్నుల కారణంగా చెప్పవచ్చు.
భారతదేశపు పన్ను వ్యవస్థలో కారు ఒక విలాసవంతమైన వస్తువు. అది మారుతీ 800 అయినా బెంజ్ అయినా. సేల్స్ రికార్డు బాగానే ఉన్నప్పటికీ సుంకాన్ని తగ్గించాలని ఆటోమొబైల్ కంపెనీలు చాలాసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
టయోటా ఫార్చ్యూనర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కారు. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.44,27,000. ఒక ఫార్చ్యూనర్ కారు అమ్మితే టయోటా కంపెనీకి లక్షల రూపాయలు వస్తాయని అనుకుంటారు కానీ మీ లెక్క తప్పింది.
ఫార్చ్యూనర్ కార్ తయారీ ధర రూ.26.67 లక్షలు. ఈ కారు అమ్మకానికి వచ్చినప్పుడు దానిపై 28% GST విధించబడుతుంది. దింతో కారు ధర 34,13,760 రూపాయల దాకా చేరుకుంటుంది.
GST మాత్రమే కాదు, 22 శాతం సెస్ పన్ను తర్వాత కారు ధర రూ.41,64,787 అవుతుంది. ఇంకా పూర్తి కాలేదు రిజిస్ట్రేషన్ మొత్తం ఖర్చు, గ్రీన్ సెస్ కూడా కలుపుతారు.ఇవన్నీ కలిపితే కారు ధర 44,27,000 రూపాయల దాకా ఉంటుంది.
ఒక నివేదిక ప్రకారం GST, సెస్, రిజిస్ట్రేషన్ అండ్ గ్రీన్ సెస్ ద్వారా ప్రభుత్వం టయోటా ఫార్చ్యూనర్ కారు నుండి సుమారు 18 లక్షల రూపాయలను ఆర్జిస్తుంది.
ఫార్చ్యూనర్ కారు ఉత్పత్తి తర్వాత అడ్వటైజింగ్, ట్రాన్స్పోర్ట్ ఇతర వంటి ఖర్చులను కూడా కంపెనీ మాత్రమే భరిస్తుంది, టయోటా కంపెనీకి ఒక ఫార్చ్యూనర్ కారు పై ఆదాయం 45,000 నుండి 50,000 రూపాయలు మాత్రమే.
కంపెనీ రూ. 45,000 నుండి రూ. 50,000 సంపాదిస్తే, టయోటా కార్ డీలర్లు ఫార్చ్యూనర్ ఒక కార్ అమ్మకం ద్వారా రూ.1 లక్ష దాకా ఆర్జిస్తోంది.