చలికాలంలో ఉపయోగపడే షియోమి హ్యాండ్ వార్మర్ పవర్ బ్యాంక్.. శీతాకాలంలో చేతులను వెచ్చగా..

By Sandra Ashok Kumar  |  First Published Nov 25, 2020, 6:23 PM IST

షియోమి బూట్ల నుండి బ్యాగులు, టీ షర్టుల వరకు మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా షియోమి కొత్త పవర్‌బ్యాంక్‌ను ప్రారంభించింది. పవర్‌బ్యాంక్‌ అంటే మొబైల్ పవర్‌బ్యాంక్‌ను కాదు, జెడ్‌ఎం‌ఐ హ్యాండ్ వార్మర్ పవర్ బ్యాంక్ షియోమి నుండి వచ్చిన ఒక కొత్త పరికరం, పేరు సూచించినట్లుగానే ఇది శీతాకాలంలో ఉపయోగపడుతుంది.


షియోమి ఇకపై టెక్నాలజి సంస్థ మాత్రమే కాదు, షియోమిని లైఫ్ స్టైల్ బ్రాండ్ అని కూడా పిలవాల్సిందే. షియోమి బూట్ల నుండి బ్యాగులు, టీ షర్టుల వరకు మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా షియోమి కొత్త పవర్‌బ్యాంక్‌ను ప్రారంభించింది.

పవర్‌బ్యాంక్‌ అంటే మొబైల్ పవర్‌బ్యాంక్‌ను కాదు, జెడ్‌ఎం‌ఐ హ్యాండ్ వార్మర్ పవర్ బ్యాంక్ షియోమి నుండి వచ్చిన ఒక కొత్త పరికరం, పేరు సూచించినట్లుగానే ఇది శీతాకాలంలో ఉపయోగపడుతుంది. దీనితో మీరు శీతాకాలంలో మీ చేతులను వెచ్చగా చేయవచ్చు.

Latest Videos

undefined

షియోమి నుండి వస్తున్న ఈ కొత్త పవర్ బ్యాంకుకు జెడ్‌ఎం‌ఐ హ్యాండ్ వార్మర్ పవర్ బ్యాంక్ అని పేరు పెట్టారు. జెడ్‌ఎం‌ఐ హ్యాండ్ వార్మర్ పవర్‌బ్యాంక్ లో 5000mAh బ్యాటరీ ఉంది, ఈ పవర్‌బ్యాంక్ 5W ఆపిల్ ఛార్జర్ కంటే వేగంగా ఐఫోన్ 12ను ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ పవర్‌బ్యాంక్‌లో పిటిసి రకం ఉష్ణోగ్రత హీట్ టెక్నాలజి ఉంది. ఈ పవర్ బ్యాంక్ మానవ శరీరానికి సౌకర్యవంతంగా ఉండే ఉష్ణోగ్రత వరకు త్వరగా వేడి చేయగలదు, గరిష్టంగా 52 ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.

also read 

జెడ్‌ఎం‌ఐ హ్యాండ్ వార్మర్ పవర్ బ్యాంక్ ధర చైనీస్ యువాన్ 89 అంటే సుమారు రూ. 1,000, ప్రస్తుతం ఇప్పుడు చైనాలో అమ్మకానికి ఉంది. ఈ డివైజ్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, డివైజ్ తక్కువ లేదా అధిక ఉష్ణోగ్రత మధ్య మారవచ్చు.

అప్పుడు ఇది 2 నుంచి 4 గంటల మన్నిక ఉంటుంది, ఇది బయటి వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. ఈ ఉత్పత్తి భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా ఏ ధరకు లభిస్తుందనే దానిపై ఇంకా సమాచారం లేదు.

ఈ పవర్‌బ్యాంక్ ఐఫోన్ 12ని 54 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ చేయగలదని పేర్కొన్నారు. ఈ పవర్‌బ్యాంక్‌తో మీరు బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. దీనికి ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. ఈ డివైజ్ అదనపు రక్షణను అందించడానికి అధిక-నాణ్యతగల లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించినట్లు చెబుతున్నారు.  

click me!