ముద్దు సీన్లు రిహార్సల్స్ చేద్దామని ఆ డైరెక్టర్ అడిగాడు.. నటి కామెంట్స్!

Published : Sep 17, 2019, 08:12 AM ISTUpdated : Sep 17, 2019, 08:23 AM IST
ముద్దు సీన్లు రిహార్సల్స్ చేద్దామని ఆ డైరెక్టర్ అడిగాడు.. నటి కామెంట్స్!

సారాంశం

తనతో ఓ దర్శకుడు తప్పుగా ప్రవర్తించాడని గతంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ నటి జరీన్ ఖాన్. ఈ ఘటన గురించి జరీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.  

సల్మాన్ ఖాన్ నటించిన 'వీర్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది నటి జరీన్ ఖాన్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో జరీన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే కెరీర్ ఆరంభంలో ఆమెకి ఎదురైన కొన్ని చేదు సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

ఓసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో జరీన్ ముద్దు పెట్టుకునే సన్నివేశం ఒకటి చేయాల్సి వచ్చిందట. అప్పుడు ఆ చిత్ర దర్శకుడు తనతో ఆ ముద్దు సీన్ రిహార్సల్స్ చేయాలని అడిగాడట. దీనికి ఆమె అంగీకరించలేదట. ముద్దు సీన్ రిహార్సల్స్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిందట.

మరోసారి ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి 'నన్ను నువ్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా చూస్తే.. నువ్ చేసే సినిమాల కూడా నేను చూసుకుంటాం' అని చెప్పాడట. దానికి కూడా జరీన్ అంగీకరించలేదట. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఒకవేళ అతను చెప్పినట్లు చేసి  ఉంటే తనకు సాయం చేసేవాడో లేదోననే అనుమానంతో ఒప్పుకోలేదని మరో షాకింగ్ విషయం చెప్పింది.

ఆమె ఆన్సర్ విన్నవారు నమ్మకం ఉంటే అతడు అడిగిన దానికి ఒప్పుకునేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఆమెని చాలా సార్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా