మీ అభిమానం నా హృదయాన్ని కదిలించింది.. జూనియర్ ఎన్టీఆర్ హార్ట్ ఫెల్ట్ ‘థ్యాంక్ యూ’ నోట్..

By team teluguFirst Published May 20, 2022, 6:15 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) 39వ పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి.  అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు ఎన్టీఆర్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఎనలేని అభిమానం చూపించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్ ‘థ్యాంక్ యూ’ నోట్ రిలీజ్ చేశారు.
 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు ఈరోజు చాలా గ్రాండ్ నిర్వహించారు. తారక్ 39వ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్, అజయ్ దేవగన్, సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, అభిమానులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేశారు. దీంతో ఇంటర్నెట్ మొత్తం ఎన్టీఆర్ పోస్టర్స్, ఎన్టీఆర్ సీడీపీలతోనే నిండిపోయింది. పైగా తారక్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ ఫిల్మ్స్ NTR30, NTR31 నుంచి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్ రిలీజ్ కావడంతో నిన్నటి నుంచి నెట్టింట ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తూనే ఉన్నారు. 

స్పెషల్ వీడియోలు, పోస్టర్లతో ఫ్యాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలిపారు. అదేవిధంగా మరికొందరు అభిమానులు తారక్ పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన శ్రేయోభిలాషులకు, పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపిన వారందరికీ, ముఖ్యంగా ఎనలేని అభిమానం చూపిస్తున్న ఆయన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హార్ట్ ఫెల్ట్ ‘థ్యాంక్ యూ’ నోట్ ను రిలీజ్ చేశారు. 

‘నా పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ..  నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు సినీ సోదరులు, సహోద్యోగులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే, నా ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు నా కృతజ్ఞతలు. మీ అభిమానం నా హృదయాన్ని కదిలించింది. ఈ పుట్టిన రోజు నాకు మరింత ప్రత్యేకంగా నిలిచిపోనుంది. నేను ఇంట్లో లేనందున మీ అందరినీ కలవలేకపోయాను. నన్ను క్షమించండి. మీ బేషరతు ప్రేమ, మద్దతు మరియు ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుడను. నేను ఎప్పటికీ మీ రుణంలో ఉంటాను.’ అంటూ భావోద్వేగంగా ప్రకటన విడుదల చేశారు. 

 

Thank you. pic.twitter.com/cDpTnBHeoR

— Jr NTR (@tarak9999)
click me!