విషాదం.. శ్రీదేవిని గుర్తు చేసేలా బాత్ టబ్ లో మరణించిన సింగర్

Published : Nov 06, 2022, 06:28 PM IST
విషాదం.. శ్రీదేవిని గుర్తు చేసేలా బాత్ టబ్ లో మరణించిన సింగర్

సారాంశం

హాలీవుడ్ లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. యువ సింగర్ ఆరోన్ కార్టర్ (34) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాత్ టబ్ లో విగత జీవిగా కనిపించారు.

హాలీవుడ్ లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. యువ సింగర్ ఆరోన్ కార్టర్ (34) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాత్ టబ్ లో విగత జీవిగా కనిపించారు. ఆరోన్ కార్టర్ హాలీవుడ్ లో సింగర్ గా, రాపర్ గా, నటుడిగా రాణిస్తున్నారు. తన ప్రతిభతో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లక్షలాది మంది అభిమానులు ఆరోన్ మ్యూజిక్ వీడియోల్ని ఫాలో అవుతుంటారు. 

ఆరోన్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. తన నివాసంలోనే బాత్ టబ్ లో శవంగా కనిపించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆరోన్ కి శత్రువులు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

దీనితో ఆరోన్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 34 ఏళ్ల చిన్న వయసులోనే ఆరోన్ మృతి చెందడంతో అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. అయితే ఆరోన్ కి డ్రగ్స్, ఇతర వ్యసనాలు  ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది ఆరోన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆరోన్ మృతికి సరైన కారణాలు ఇంకా తెలియలేదు. ఆరోన్ బాత్ టబ్ లో మరణించడం అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేస్తోంది. 2018లో శ్రీదేవి కూడా దుబాయ్ లో బాత్ టబ్ లో మరణించిన సంగతి తెలిసిందే. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి