అయ్యో 'యాత్ర'.. జగన్ లో కదలికైనా లేదే?

Published : Feb 06, 2019, 04:38 PM IST
అయ్యో 'యాత్ర'.. జగన్ లో కదలికైనా లేదే?

సారాంశం

బయోపిక్ తెరకెక్కుతోంది అంటే ఆ కథకు సంబందించిన వారి హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొన్న ఎన్టీఆర్ రిలీజైనప్పుడు చంద్రబాబు కూడా సినిమాపై ఓ లుక్కేశారు. ఇక నందమూరి హడావుడి ఏ రేంజ్ లో  కనిపించిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మాత్రం తన తండ్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమాపై కాస్త కూడా స్పందించడం లేదు. 

రాజకీయాల్లో ఆయన బిజీగానే ఉండవచ్చు గాని కనీసం ఓ ట్వీట్ కూడా చేయడానికి తీరిక లేదా అని ఓ వర్గం వారు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాపై స్పందిస్తే ఎక్కడ తన పాలిటిక్స్ కి సినిమా రంగు అంటిస్తారో అని.. జగన్ స్పందించడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన యాత్ర ప్రీ రిలీజ్ కు జగన్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ ప్రస్తావన ఆ ఈవెంట్ లో బాగానే వచ్చింది గని ఆయన రాలేదు. 

అయితే యాత్ర టీమ్ మాత్రం జగన్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తే బావుంటుందని బాగానే ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఎంతో సమయం లేదు. శుక్రవారం భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమాకు బజ్ మాత్రం పెద్దగా లేదు. మమ్ముంటికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా బిజినెస్ లేదు. ప్రమోషన్స్ పెంచాల్సిన సమయంలో చిత్ర యూనిట్ చప్పుడు చేయడం లేదు. 

సినిమాతో బిజినెస్ చేస్తున్న వారు జగన్ యాత్ర ప్రమోషన్స్ లో ఓ అడుగేస్తే సినిమాపై జనాల్లో ఆసక్తి పెరుగుతుందని అనుకుంటున్నారు. కానీ జగన్ ఇంతవరకు సినిమా గురించి కనీసం చిన్న మాట అయినా మాట్లాడలేదు. రాజకీయాల్లో భాగంగా ఆయన మద్దతుతోనే సినిమా వస్తోంది అనే కామెంట్స్ బాగానే వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు గాని జగన్ మాత్రం యాత్ర సినిమాపై కామెంట్ చేసేలా లేడని టాక్ వస్తోంది.. మరి సినిమా రిలీజ్ అనంతరం సినిమానైనా చూస్తారో లేదో..     

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ