Keerthy Suresh: నిజ జీవితంలో కూడా పర్స్ కొట్టేశా... కీర్తి ఆన్సర్ కి మహేష్ మైండ్ బ్లాక్! 

By Sambi ReddyFirst Published May 21, 2022, 5:29 PM IST
Highlights

సర్కారు వారి పాట మూవీలో మహేష్ పర్సు కొట్టేసింది కీర్తి సురేష్. అయితే ఈ చిన్నది నిజ జీవితంలో కూడా పర్స్ కాజేశారట. ఆ కహాని విని మహేష్ తో పాటు అందరూ షాక్ అయ్యారు.

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) టీమ్ ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్, కీర్తి సురేష్ ,దర్శకుడు పరుశురామ్ కొత్తగా సోషల్ మీడియా సెలెబ్స్, యూట్యూబర్స్ తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. వాళ్లలో ఒకరు కీర్తి సురేష్ ని ఓ నాటీ ప్రశ్న అడిగారు. సర్కారు వారి పాట మూవీలో మీరు మహేష్ బాబు పర్స్ కొట్టేస్తారు, అలాగే నిజ జీవితంలో కూడా ఎవరిదైనా పర్స్ దొంగిలించారా? అని అడిగారు. దానికి మహేష్, రియల్ లైఫ్ లో కీర్తి జేబులు ఎలా కొట్టేస్తారని సమాధానం చెప్పారు. 

అయితే మహేష్ (Mahesh Babu)ని కీర్తి ఖండించారు. లేదు నేను నిజంగా కూడా పర్స్ కొట్టేశాని ఓపెన్ అయ్యింది. గతంలో మా నాన్న గారి పర్స్ దొంగిలించానని కీర్తి చెప్పడంతో మహేష్ షాక్ అయ్యాడు. ఇక కీర్తి బోల్డ్ ఆన్సర్ కి అందరూ ఫిదా అయ్యారు. కీర్తి సురేష్ తల్లి మేనక మాజీ హీరోయిన్ కాగా తండ్రి సురేష్ దర్శకుడు. అలా చిత్ర పరిశ్రమలో కీర్తి పుట్టిపెరిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించారు. పసి ప్రాయంలోనే సంపాదన మొదలుపెట్టిన కీర్తి (Keerthy Suresh)కి నాన్న పర్స్ దొంగిలించాల్సిన అవసరం మరి ఎందుకు వచ్చిందో కదా.. 

ఇక సర్కారు వారి పాట రూ. 180 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ క్రాస్ చేసింది. సర్కారు వారి పాట రూ. 200 కోట్ల మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. శని, ఆదివారం సర్కారు వారి పాట తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టే సూచనలు కలవు. మే 27న ఎఫ్ 3 విడుదలయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద మహేష్ చిత్రానికి పోటీ లేదు. 

దర్శకుడు పరుశురామ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటరైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సముద్ర ఖని, నదియా, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేశారు. సర్కారు వారి చిత్రానికి థమన్ సంగీతం అందించారు. 
 

click me!