‘ఆర్ఆర్ఆర్’ నటుడు రే స్టీవెన్సన్ (Ray Stevenson) హఠాన్మరణానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోవడానికి కారణంగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్తలతో షాక్ లో సినీలోకానికి మరో షాక్ తగిలింది. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న బ్రిటీష్ నటుడు రే స్టీవెన్సన్ కూడా తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఉన్నట్టుండి హఠాన్మరణం చెందడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. RRR టీమ్ తోపాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయన మరణ వార్తకు చింతించారు.
అయితే రే స్టీవెన్సన్ ఎలా మరణించడానే దానిపై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 58 ఏళ్ల వయస్సులోనే మృతి చెందడంతో అసలు కారణం ఏంటనేది అందరీలో మిగిలి ఉన్న సందేహం. కాగా, స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యమే కారణమని ఇటాలియన్ మీడియా రిపబ్లికా వెల్లడించింది. ఇటలీలో ఆయన న్యూ ప్రాజెక్ట్ అయిన ‘క్యాసినో’ చిత్ర షూటింగ్ చేస్తుండగా స్టీవెన్సన్ మిస్టరీ ఇల్ నెస్ కు గురయ్యారంట. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో గవర్నర్ స్కాట్ బక్స్ టన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక రే స్టీవెన్సన్ ‘థోర్’ సిరీస్ తో పాపులారిటీనీ దక్కించుకున్నారు. ఇది 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు వచ్చిన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్, ది ట్రాన్స్ పోర్టర్, యాక్సిడెంట్ మ్యాన్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
ఈయన యూకేలో 1964 మే 25న జన్మించారు. ప్రముఖ బ్రిటీష్ నటుడు ఎనిమిదేళ్ల వయస్సు నుంచి ఇంగ్లాండ్ లోనే నివసిస్తున్నారు. 25 వయస్సు నుంచి నటనా వృత్తిని కొనసాగించారు. అంతకు ముందుకు లండన్ లోని ఆర్కిటెక్చర్ సంస్థలో ఇంటీరియర్ డిజైనర్ గానూ వర్క్ చేశారు. మరో నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి సీని ప్రముఖులు చింతిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.