మన హృదయాలను గెలుచుకుంటున్న `వారియర్‌ క్వీన్‌`..బర్త్ డే సీడీపీ హల్‌చల్‌

Published : Nov 07, 2020, 08:36 AM IST
మన హృదయాలను గెలుచుకుంటున్న `వారియర్‌ క్వీన్‌`..బర్త్ డే సీడీపీ హల్‌చల్‌

సారాంశం

తెలుగు, తమిళంలో ప్రముఖంగా రాణిస్తున్న అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు(శనివారం). ఈ సందర్బంగా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు అభిమానులు. ఈ బర్త్ డే సీడీపీని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

యోగా టీచర్‌ కాస్త ఊహించిన విధంగా హీరోయిన్‌గా మారి ఇప్పుడు అగ్ర హీరోయిన్‌ స్థాయికి ఎదగడంతోపాటు తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అనుష్క శెట్టి. ఈ బెంగుళూరు బ్యూటీ మొదట గ్లామర్‌ పాత్రల్లో మెప్పించి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు సంబంధించి నయా ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి ఇప్పుడు శక్తివంతమైన మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

తెలుగు, తమిళంలో ప్రముఖంగా రాణిస్తున్న అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు(శనివారం). ఈ సందర్బంగా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు అభిమానులు. ఈ బర్త్ డే సీడీపీని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుష్కకి బర్త్ డే విశెష్‌ తెలిపారు. `అత్యద్భుతమైన, చిరస్మరణీయమైన ప్రదర్శనతో మన హృదయాలను కొనసాగిస్తున్న మా వారియర్‌ క్వీన్‌ `రుద్రమదేవి`కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

ఇందులో అనుష్క జనరల్‌ ఫోటో మెయిన్‌గా ఉండగా, కింద `అరుంధతి`లోని ఆమె గెటప్‌, అలాగే దేవసేనగా `బాహుబలి`లోని గెటప్సులు, `వేదం` సినిమాలోని గెటప్‌, `భాగమతి` గెటప్‌, `రుద్రమదేవి` గెటప్పులున్నాయి. బర్త్ డే సీడీపీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దీన్ని, హ్యాపీబర్త్డ డే అనుష్క శెట్టి యాష్‌ ట్యాగ్‌ని అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా