పవన్ తాజా చిత్రంలో వివి వినాయక్ గెస్ట్ రోల్.!?

By Surya Prakash  |  First Published Jun 9, 2021, 3:40 PM IST


రీసెంట్ గా  వినాయిక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు.  


ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ అప్పట్లో ..తన దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ సినిమాలో చేసారు. చిరంజీవి,వినాయిక్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సీన్స్ బాగా పాపులర్ అయ్యాయి. జనం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో మెరిసినా అవి పెద్దగా చెప్పుకోదగిన పాత్రలు కాదు. ఏవో మొహమాటానికి చేసినవి. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు వి.వి.వినాయక్ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం. 

Latest Videos

రీసెంట్ గా  ఆయన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు. రానా, వినాయక్ ల మధ్య కాంబినేషన్ సీన్ ఉండబోతోంది. పోలీసులతో గొడవ పడొద్దంటూ రానాకి సలహా ఇచ్చే పాత్రలో వినాయక్ కనిపించనున్నారని సమాచారం. 
 
 పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి రూపొందించిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మొదలైన చిన్న గొడవ ఇగో క్లాష్ కారణంగా ఏ స్థాయికి వెళ్లిందనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,   రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
 

click me!