గుత్తాజ్వాలాతో ఎఫైర్ పై హీరో కామెంట్స్!

Published : Jun 07, 2019, 09:51 AM IST
గుత్తాజ్వాలాతో ఎఫైర్ పై హీరో కామెంట్స్!

సారాంశం

గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకి తమిళ హీరో విష్ణుతో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకి తమిళ హీరో విష్ణుతో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు నెటిజన్లు.

విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోవడంతో ఇప్పుడు గుత్తాజ్వాలాని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు హీరో విష్ణు.

తనకు జ్వాలా అంటే ఇష్టమని, ఆమెకి కూడా నేనంటే ఇష్టమని అని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పారు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని, ఈ స్నేహం తదుపరి దశకు వెళ్తుందా అనే ప్రశ్నకు తనవద్ద సమాధానం లేదని, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని చెప్పారు.

ఇటీవల 'రాక్షసన్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం 'జగజ్జాల కిలాడి' అనే సినిమాలో నటిస్తున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?