విశాల్ కూడా చెప్పేశాడు..!

Published : Jan 16, 2019, 03:09 PM ISTUpdated : Jan 16, 2019, 03:19 PM IST
విశాల్ కూడా చెప్పేశాడు..!

సారాంశం

ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో గాని సడన్ గా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ విశాల్ జోడి ఇచ్చిన ప్రకటన అందరిని షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ ను ఎదుర్కొంటున్న విశాల్ ఎట్టకేలకు తన పెళ్లి పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశాడు. 

ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో గాని సడన్ గా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ విశాల్ జోడి ఇచ్చిన ప్రకటన అందరిని షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ ను ఎదుర్కొంటున్న విశాల్ ఎట్టకేలకు తన పెళ్లి పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశాడు. తన పెళ్లి విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుయజేస్తూ తనకు కాబోయే శ్రీమతి ఫోటోలను కూడా షేర్ చేసుకున్నాడు. 

హైదరాబాద్ కు చెందిన అనీషాను వివాహం చేసుకోబోతున్నట్లు నిన్నటి నుంచే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనీషా నుంచి క్లారిటీ రాగా కొద్దిసేపటి క్రితం విశాల్ కూడా సమాధానం ఇచ్చేశాడు. యస్.. చాలా హ్యాపీగా ఉంది. ఆమె తన అంగీకారాన్ని తెలిపిందని చెబుతూ నా జీవితంలో భాగస్వామ్యురాలవ్వడానికి సిద్దమైనట్లు విశాల్ తెలిపాడు. 

అంతే కాకుండా త్వరలోనే వివాహ వేడుకలకు సంబందించిన డేట్ ను ఎనౌన్స్ చేస్తానని కూడా విశాల్ పేర్కొనడంతో విశాల్ - అనీషాలకు సెలబ్రెటీలు అభిమానులు విషెస్ అందిస్తున్నారు. కోలీవుడ్ హీరో అయినా విశాల్ ఇప్పుడు తెలంగాణకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో టాలీవుడ్ కి మరింత దగ్గరవుతాడని చెప్పవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?