టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

Published : Nov 11, 2018, 09:02 PM IST
టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సివున్నా.. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. 

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సివున్నా.. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. 

ఎట్టకేలకు సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. హారర్, కామెడీ జోనర్ లో సాగనున్న ఈ సినిమా ట్రైలర్ ని కూడా అవే ఎలిమెంట్స్ తో కట్ చేశారు.

ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాబ్ డ్రైవర్ గా మారిన ఓ కుర్రాడి కథే ఈ సినిమా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన కారులో దెయ్యం ఉంటుంది. కారులో దెయ్యం అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ట్రైలర్ లో విజయ్ భయం భయంగా కనిపించాడు.

గతంలో ఇదే కాన్సెప్ట్ తో నయనతార 'డోర' సినిమా వచ్చింది. మరి ఆ సినిమాతో 'టాక్సీవాలా'కి పోలికలు రాకుండా చిత్రబృందం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఎదురుచూడాల్సిందే!

PREV
click me!

Recommended Stories

Toxic : నయనతార నుంచి కియారా అద్వానీ వరకు యష్ తో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల వయసు ఎంత?
Posani krishna Murali: పోసాని ఎత్తుకుని పెంచిన బుడ్డోడు.. మహేష్,ప్రభాస్,ఎన్టీఆర్ లతో బ్లాక్‌ బస్టర్స్.. ఆ స్టార్ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?