ఆస్కార్ కోసం విజయ్ దేవరకొండ సినిమా

Published : Sep 21, 2019, 06:18 PM ISTUpdated : Sep 21, 2019, 08:49 PM IST
ఆస్కార్ కోసం విజయ్ దేవరకొండ సినిమా

సారాంశం

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో నిలిచింది. భారీ అంచనాలతో ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో నిలిచింది. భారీ అంచనాలతో ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఆ సినిమా ఇప్పుడు ఆస్కార్ పోటీకి సిద్ధమైంది. 

ఫిల్మ్‌ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా భారత నుంచి 28 చిత్రాలకు స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ ఈ జ్యూరీకి అధ్యక్షుడు. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతోంది. ఆ లిస్ట్ లో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఉంది. ఇక ఈ సినిమాలన్నీటీలో ఒక చిత్రాన్ని  బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు. 

ఇందులో విశేషం ఏమిటంటే.. ఈ క్యాటగిరిలో నిలిచినా ఏకైక తెలుగు చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే సినిమా ఏ భాషలోను సక్సెస్ సాధించలేకపోయింది. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో చోటు దక్కించుకుంది.

PREV
click me!

Recommended Stories

Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే