
బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. తాజాగా ఆమె `క్యాస్టింగ్ కౌచ్` పై బాంబ్ పేల్చింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కి ఎదుర్కొన్నట్టు తెలిపింది. అయితే తెలివిగా దాన్నుంచి బయటపడినట్టు చెప్పింది. ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అదృష్ట వశాత్తు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో నేను చిక్కకోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందే, ఇక్కడ పరిస్థితులు భయానకంగా ఉంటాయని చాలా మంది నాకు కథలు కథలుగా చెప్పారు. అందుకే మా పేరెంట్స్ భయపడి నన్ను సినిమాల్లోకి పంపించడానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పటి వరకు తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదుగానీ, ఓ సారి తృటిలో తప్పించుకున్నాను` అని వెల్లడించింది విద్యా బాలన్.
ఇంకా ఆమె చెబుతూ, క్యాస్టింగ్ కౌచ్‌కి సంబంధించి తనకు ఎదురైన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ విషయాలను పంచుకుంది విద్యాబాలన్. ఓ యాడ్ షూట్ కోసం చెన్నైకి వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. సినిమా గురించి చర్చించడానికి మేం కాఫీ షాప్ కి వెళ్లాం. కథ గురించి మాట్లాడుతున్న సమయంలో `మిగతా విషయాలు మనం రూమ్‌కి వెళ్లి మాట్లాడుకుందాం` అని అన్నాడు.
`ఆ టైమ్‌లో తాను ఒక్కదాన్నే ఉన్నా, భయపడుతూనే రూమ్‌కి వెళ్లాను. అక్కడికి వెళ్లిన వెంటనే తెలివిగా వ్యవహరించి గది తలుపులు తెరిచే పెట్టాను. అతడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ క్షణం అలా చేయమని నాకుఎవరూ సలహాలు ఇవ్వలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నన్ను నేను రక్షించుకున్నా` అని వెల్లడించింది విద్యాబాలన్. ఇప్పుడు విద్యాబాలన్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో, ఇటు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
అనేక కమర్షియల్ చిత్రాలతో మెప్పించిన విద్యాబాలన్‌కి `డర్టీ పిక్చర్` చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది. కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకుంది. దీంతో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. ఆ మధ్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. గతేడాది హిందీలో `జల్సా` చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు `నీయత్`తోపాటు మరో సినిమాలో నటిస్తుంది.