తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో టాలీవుడ్ హీరో!

Published : Nov 28, 2018, 01:28 PM IST
తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో టాలీవుడ్ హీరో!

సారాంశం

తెలంగాణాలో ఎన్నికల వాతావరణం రోజురోజుకి వేడేక్కుతోంది. ప్రచారాలకు ఇంకా వారం రోజులే సమయం ఉండటంతో  రాజకీయ నాయకులూ అలుపులేకుండా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి ముఖ్యమైన నేతలు కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ ముందుకు కదులుతున్నారు. 

అయితే సినీ తారలు కూడా ఎలక్షన్స్ ప్రచారాల్లో తమవంతు సహకారాలను అందిస్తున్నారు. ఇకపోతే గతంలో హీరోగా వెలుగొందిన టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి కూడా ప్రజకూటమి కండువాలతో కనిపిస్తూ ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

ఎందుకంటే తెలుగు దేశం పార్టీ తరపున వేణు మామయ్యా నామ నాగేశ్వర రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. దీంతో సాధారణ వ్యక్తిలా సైకిల్ తొక్కుతూ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక మరోవైపు కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగిన నందమూరి సోదరి సుహాసిని కోసం నందమూరి బ్రదర్స్ ప్రచారాల్లో బిజీ కానున్నారు. ఇప్పటికే తారకరత్న మొదలుపెట్టగా మరికొన్ని రోజుల్లో కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు