ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ డోస్‌ పెంచి.. `ఎఫ్‌3` గ్రాండ్‌ ఓపెనింగ్‌..వరుణ్‌, తమన్నా సందడి

Published : Dec 17, 2020, 01:24 PM IST
ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ డోస్‌ పెంచి.. `ఎఫ్‌3` గ్రాండ్‌ ఓపెనింగ్‌..వరుణ్‌, తమన్నా సందడి

సారాంశం

`ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని రూపొందించబోతున్నట్టు ఇటీవల వెంకీ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. తాజాగా గురువారం ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ఓపెనింగ్‌ జరిగింది.  అల్లు అరవింద్‌ హీరోహీరోయిన్లు వరుణ్‌ తేజ్‌, తమన్నాలపై క్లాప్‌ నిచ్చారు.

రెండేళ్ళ క్రితం వచ్చిన `ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌`(ఎఫ్‌2) ఊహించని విధంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా అలరించారు. అనిల్‌ రావిపూడి తనదైన కామెడీతో మ్యాజిక్‌ చేశాడు. దీంతో ఇది సంక్రాంతి కానుకగా విడుదలై వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. తాజాగా రెట్టింపు ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌తో మరో సినిమా రాబోతుంది. 

`ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని రూపొందించబోతున్నట్టు ఇటీవల వెంకీ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. తాజాగా గురువారం ఈ సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ చిత్ర ఓపెనింగ్‌ జరిగింది.  అల్లు అరవింద్‌ హీరోహీరోయిన్లు వరుణ్‌ తేజ్‌, తమన్నాలపై క్లాప్‌ నిచ్చారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌ తేజ్‌, తమన్నాలతోపాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. 

ఈ చిత్రాన్ని దిల్‌రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఇందులో మరో హీరో ఉంటారా? లేక వెంకీ, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌లతోనే తెరకెక్కిస్తారా? అన్నది సస్పెన్స్ నెలకొంది. గతంలో మరో హీరో నటిస్తారనే టాక్‌ వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి డబ్బు తో వచ్చే ఫన్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా