వరుణ్ తేజ్ 'వాల్మీకి' ప్రీటీజర్ కు ముహూర్తం ఫిక్స్!

Published : Jun 22, 2019, 10:51 AM IST
వరుణ్ తేజ్ 'వాల్మీకి' ప్రీటీజర్ కు ముహూర్తం ఫిక్స్!

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు ఇది రీమేక్. హరీష్ శంకర్ కొన్ని మార్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు ఇది రీమేక్. హరీష్ శంకర్ కొన్ని మార్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కెరీర్ లో తొలిసారి వరుణ్ తేజ్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. వరుణ్ తేజ్ గెటప్ కూడా విభిన్నంగా ఉండబోతోంది. 

తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మంచి అంచనాలున్న ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకురావాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. త్వరలో ప్రీ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు హరీష్ శంకర్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా ప్రీటీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. 

జూన్ 24న సాయంత్రం 5:18 గంటలకు వాల్మీకి ప్రీటీజర్ రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ మిగిలిన మెగా హీరోలకు భిన్నంగా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలని ఎంపిక చేసుకుంటున్నాడు. కంచె, అంతరిక్షం లాంటి చిత్రాల్లో వరుణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల వరుణ్ తేజ్ వాల్మీకి షూటింగ్ కోసం వెళుతూ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరక్కుతోంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

 

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?