ఐదేళ్ల తరువాత రాజకీయాల్లోకి.. హీరోయిన్ కామెంట్స్!

Published : Oct 31, 2018, 09:34 AM IST
ఐదేళ్ల తరువాత రాజకీయాల్లోకి.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ప్రముఖ హీరో శరత్ కుమార్ కూతురు తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించింది. ఇటీవల ఆమె నటించిన 'పందెంకోడి 2' సినిమా తెలుగులో విడుదలైంది. ఇందులో ఆమె విలన్ పాత్రలో మెప్పించింది. త్వరలోనే విడుదల కానున్న 'సర్కార్' సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించింది

ప్రముఖ హీరో శరత్ కుమార్ కూతురు తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించింది. ఇటీవల ఆమె నటించిన
'పందెంకోడి 2' సినిమా తెలుగులో విడుదలైంది.

ఇందులో ఆమె విలన్ పాత్రలో మెప్పించింది. త్వరలోనే విడుదల కానున్న 'సర్కార్' సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

''మహిళలలో చైతన్యం అవసరం. సమాజానికి ఏదోకటి చేయగల నేర్పు వాళ్లకి ఉంది. నాకు కూడా ఏదైనా చేయాలని అనిపిస్తుంటుంది. అందుకోసం రాజకీయాల్లోకి వస్తాను. అయితే ఇప్పుడే కాదు.. దానికి ఇంకా టైమ్ ఉంది. ఐదేళ్ల తరువాత రాజకీయాల్లోకి వస్తాను. దర్శకత్వం చేయాలని కూడా అనిపిస్తుంది. త్వరలోనే ఓ సినిమాను డైరెక్ట్ చేస్తా.. ఈలోగా సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకుంటాను'' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక విశాల్ తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. ''విశాల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే.. మేమిద్దరం చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం.. మా మధ్య ఎప్పుడూ ప్రేమ, పెళ్లి అనే టాపిక్ రాలేదు'' అని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Krishna Vamsi: రమ్యకృష్ణతో విడాకులు, కొడుకు చదువుపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గతం తెలుసుకున్న బాలు, మీనా.. దెబ్బకు రోడ్డుమీద పడిన రోహిణీ