అందుకే గ్లామర్ రోల్స్ చేయను.. విలన్ పాత్రలు ఎందుకు ఇష్టమో చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్

Published : Jan 09, 2023, 04:07 PM IST
అందుకే గ్లామర్ రోల్స్ చేయను.. విలన్ పాత్రలు ఎందుకు ఇష్టమో చెప్పిన వరలక్ష్మి శరత్ కుమార్

సారాంశం

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన పంథాలో రాణిస్తోంది. 

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన పంథాలో రాణిస్తోంది. నటీమణులు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ వరలక్ష్మి మాత్రం ఎక్కువగా విలన్ రోల్స్, వైవిధ్యమైన నెగిటివ్ రోల్స్ ఎంచుకుంటోంది. 

విజయ్ సర్కార్ చిత్రంలో వరలక్ష్మి విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రాక్ , యశోద చిత్రాల్లో కూడా వరలక్ష్మి నెగిటివ్ రోల్స్ చేసింది. అన్ని చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో కూడా వరలక్ష్మి నెగిటివ్ రోల్ చేస్తోంది. 

ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేయడం,గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడం గురించి వరలక్ష్మి ఓపెన్ అయింది. వరలక్ష్మి మాట్లాడుతూ.. గ్లామర్ పాత్రలు నాకు వర్కౌట్ కావు. ఆ పాత్రలు చేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ నేను చేసే కొన్ని పాత్రలకు నేను మాత్రమే చేయగలను. నెగిటివ్ రోల్స్ తో నేను సంతోషంగా ఉన్నాను అని వరలక్ష్మి తెలిపింది. 

వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ ఆరంభంలో కాస్త గ్లామర్ పాత్రలపై ఆసక్తి చూపినప్పటికీ ఆ తర్వాత పంథా మార్చుకుంది. అలాగే అప్పట్లో వరలక్ష్మి.. హీరో విశాల్ తో కొంతకాలం ప్రేమాయణం సాగించినట్లు కూడా రూమర్లు వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?