అత్తారింటికి దారేది.. దొబ్బిందా రాజా?

By Prashanth MFirst Published Feb 2, 2019, 4:13 PM IST
Highlights

ఒక భాషలో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా సినిమా మరో భాషలో హిట్టవుతుందనేది చాలా రేర్. అయితే రీమేక్ చేస్తే ఎంతో కొంత మినిమమ్ వసూళ్లను అందుకుంటుంది అనేది వాస్తవం. కానీ  శింబు రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం దారుణంగా బెడిసికొట్టేలా ఉంది. 

ఒక భాషలో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా సినిమా మరో భాషలో హిట్టవుతుందనేది చాలా రేర్. అయితే రీమేక్ చేస్తే ఎంతో కొంత మినిమమ్ వసూళ్లను అందుకుంటుంది అనేది వాస్తవం. కానీ  శింబు రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం దారుణంగా బెడిసికొట్టేలా ఉంది. 2013లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

అయితే తమిళ్ లో ఆ సినిమాను సుందర్ సి దర్శకత్వంలో 2.0 నిర్మాణసంస్థ లైకా *వందా రాజాదా వ‌రువేన్* గా తెరకెక్కించింది. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచి ఊహించని విధంగా టాక్ వస్తోంది. శింబు ఓవరాక్షన్ చేసి సినిమా ఫెయిల్యూర్ లో కీ రోల్ పోషించడాని పబ్లిక్ మైకుల ముందు గట్టిగా చెప్పేస్తున్నారు. సినిమాలో పెద్దగా మార్పులు లేకుండా సుందర్ సి త్రివిక్రమ్ స్టైల్ ని ఫాలో అయ్యాడు. 

కానీ ఆ టచ్ రీమేక్ లో తమిళ ప్రేక్షకులకు నచ్చలేదు. తెలుగులో పవన్ స్టామినా - త్రివిక్రమ్ టేకింగ్ కి తగ్గట్టుగా కోలీవుడ్ టీమ్ తీయలేకపోయిందని రివ్యూలు వస్తున్నాయి. ఆత్తగా నటించిన రమ్యకృష్ణ క్రేజ్ కూడా సినిమాకు ఉపయోగపడేలా లేదు. 1 నుంచి 2.5 మధ్యలో రివ్యూలు వస్తుండడంతో సినిమా రిజల్ట్ తేడా కొట్టేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.  

Asianet News special : భారీ నష్టాలతో దెబ్బ కొట్టిన రీసెంట్ మూవీస్

click me!