Unstoppable-2 : బాలయ్య - పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ కు డేట్ ఫిక్స్!

Published : Dec 19, 2022, 01:36 PM IST
Unstoppable-2 : బాలయ్య - పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ కు డేట్ ఫిక్స్!

సారాంశం

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’షోకు త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది.   

బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలతో అలరిస్తూనే.. బుల్లితెరపై టాక్ షోతోనూ దుమ్ములేపుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna). బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంతో.. వెంటనే రెండో సీజన్ ను కూడా ప్రారంభించారు. సెకండ్ సీజన్ ను మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసకున్న ఈషోకు త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) కూడా హాజరు కాబోతున్నారు. 

నెక్ట్స్ ఎపిసోడ్ పై రీసెంట్ గా ‘ఆహా’ మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన విషయం తెసిందే. తర్వలోనే Unstoppable with NBk Season 2కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టు ఓ స్పెషల్ వీడియో ద్వారా హింట్ ఇచ్చారు. సెకండ్ సీజన్ లో రెండో ఎపిసోడ్ కు అతిథులుగా వచ్చిన నిర్మాత నాగవంశీ, హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి.. ఎవరితో రావాలో తెలుసు కదా? అనే వీడియోను ఇటీవల షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ పక్కా అనేది తెలిసి పోయింది. 

నెక్ట్స్ ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోకు వస్తున్నారని ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యింది. ప్రస్తుతం బాలయ్య - పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ పై క్రేజీ అప్డెట్ అందింది. ఈనెల 27న షూటింగ్ జరగనుందని సమాచారం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు, సినిమా షెడ్యూల్స్ తో ఫుల్ బిజీ కానుండటంతో వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారంట. ఏదేమైనా నెక్ట్స్ ఎపిసోడ్ తో బుల్లితెర మరోసారి బ్లాస్ట్ కానుంది. ఇటు పవన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక, తొలిసారిగా బుల్లితెరపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ - గోపీచంద్ కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. రీసెంట్ గా విడుదలైన ప్రోమోకే ఒక్కరోజులోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. డిసెంబర్ 30న ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?