అకౌంట్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌లో ధురంధర్ క్యారెక్టర్లు.. ఇదేం క్రియేటివిటీ గురూ..

Published : Mar 28, 2026, 03:57 PM IST
Dhurandhar Movie Characters Feature

సారాంశం

బాలీవుడ్ సినిమా 'ధురంధర్' క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందంటే.. ఏకంగా ఎగ్జామ్ పేపర్‌లోకి కూడా వచ్చేసింది. ఓ టీచర్ తన అకౌంటెన్సీ క్వశ్చన్ పేపర్‌లో సినిమాలోని క్యారెక్టర్ల పేర్లను వాడారు.  వివరాల్లోకి వెళ్తే.. 

ఎగ్జామ్ హాల్స్‌లోకి పాకిన సినిమా అభిమానం.. 

సినిమా పిచ్చి అంటే థియేటర్లలోనో, సోషల్ మీడియా ట్రెండ్స్‌లోనో మాత్రమే కాదు.. ఇప్పుడు ఏకంగా ఎగ్జామ్ హాల్స్‌లోకి కూడా పాకింది. అవును, మీరు విన్నది నిజమే! బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్' సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రభావం ఓ టీచర్‌పై ఎంతలా పడిందంటే.. ఆయన ఏకంగా అకౌంట్స్ క్వశ్చన్ పేపర్‌నే సినిమా క్యారెక్టర్లతో నింపేశారు. ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

క్వశ్చన్ పేపర్‌లో సినిమా క్యారెక్టర్లు

"ధురంధర్ సినిమా ఎంత వైరల్ అయ్యిందంటే, అకౌంట్స్ టీచర్ కూడా అభిమాని అయిపోయారు" అనే క్యాప్షన్‌తో నెటిజన్లు దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. సాధారణంగా అకౌంట్స్ లెక్కల్లో రాము, శ్యామ్ లేదా A, B లాంటి పేర్లు వాడుతుంటారు. కానీ ఈ క్రియేటివ్ టీచర్ మాత్రం 'ధురంధర్' సినిమాలోని క్యారెక్టర్లయిన హమ్జా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్ పాత్ర), రెహ్మాన్ డకాయిత్ (అక్షయ్ ఖన్నా), ఉజైర్ బలోచ్ (దానిష్ పండోర్), అజయ్ సన్యాల్ (ఆర్. మాధవన్), జమీల్ జమాలి (రాకేష్ బేడీ), ఆలం (గౌరవ్ గేరా) పేర్లను ప్రశ్నల్లో వాడారు. 

నెటిజన్ల కామెంట్స్.. డైరెక్టర్ డీటెయిలింగ్‌కు ఫిదా!

సినిమాలోని కథకు, అకౌంటింగ్ లెక్కలకు లింక్ పెట్టి ప్రశ్నలు తయారు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ క్వశ్చన్ పేపర్ చూసిన నెటిజన్లు భలే కామెంట్లు పెడుతున్నారు. "ఇలాంటి టీచర్లు దొరికితే ఎంత బోర్ కొట్టే సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరికొందరైతే సినిమాలో ఉన్న చిన్న విషయాన్ని కూడా క్వశ్చన్ పేపర్‌లో వాడటం చూసి ఆశ్చర్యపోయారు. "సినిమాలో రెహ్మాన్ డకాయిత్ డిసెంబర్ 5, 2025న చనిపోతాడు. అదే తేదీని క్వశ్చన్ పేపర్‌లో కూడా కరెక్ట్‌గా వాడారు. ఇది డైరెక్టర్ ఆదిత్య ధర్ 'పీక్ డీటెయిలింగ్'కి నిదర్శనం" అంటూ సినిమా లవర్స్ మెచ్చుకుంటున్నారు. 

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సునామీ

ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా లాంటి పెద్ద స్టార్స్ నటించారు. మార్చి 19న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రిపోర్టుల ప్రకారం, కేవలం వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. మొత్తం మీద, 'ధురంధర్' సినిమా కేవలం వినోదానికే పరిమితం కాకుండా, జనాల రోజువారీ జీవితంలోనూ భాగమైపోతోందని చెప్పడానికి ఈ వైరల్ క్వశ్చన్ పేపరే పెద్ద ఉదాహరణ. ఇలాంటి సినిమాటిక్ ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ కూడా తెగ ఎంజాయ్ చేసే ఉంటారు!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
Karthika Deepam 2 Today Episode: దశరథ ప్రేమ-కార్తీక్ కొత్త ప్లాన్-కాశీకి దాసు సలహా-ఆస్తి వద్దన్న దీప