కంటెస్టెంట్ ప్రేరణ ఓటింగ్ లో దూసుకెళ్తుంది. ఆమె నిఖిల్, విష్ణుప్రియలను సైతం వెనక్కి నెట్టింది. తాజా ఓటింగ్ ప్రకారం ఆమె ముందంజలో ఉన్నారు.

06:30 PM (IST) Oct 24
తన సొంత టీమ్ అయిన ఓజీ క్లాన్ పై ప్రేరణ ఆరోపణలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రత్యర్థి రాయల్ క్లాన్ సభ్యుల ముందు ప్రేరణ తన అసహనం వెళ్ళగక్కింది.
06:17 PM (IST) Oct 24
ఫిజికల్ టాస్క్ లలో ఓజీ, రాయల్ క్లాన్ సభ్యులు పోటీ పడుతున్నారు. అయితే ఓజీ క్లాన్ కి చెందిన నిఖిల్ నుండి రాయల్ క్లాన్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. అతడు ప్రతి టాస్క్ లో బాగా పోరాడుతున్నాడు. మరో టాస్క్ లో సైతం సత్తా చాటాడు.
06:13 PM (IST) Oct 24
గతంలో గంగవ్వ ఓ వీడియో కోసం చిలుకను పంజరంలో బంధించింది. చిలుక జోస్యం పేరుతో ఆమె చేసిన వీడియోపై కేసు నమోదు అయ్యింది. ఆమె వన్య ప్రాణుల రక్షణ చట్టాలను ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. ఈ కేసులో గంగవ్వ విచారణ ఎదుర్కోవాల్సి ఉందట. అందు కొరకు గంగవ్వ బిగ్ బాస్ షో నుండి బయటకు రానుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
05:51 PM (IST) Oct 24
రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ మధ్య జరిగిన టాస్క్ ల్లో రాయల్ క్లాన్ విన్ అయ్యింది. దీంతో ప్రేరణ తట్టుకోలేకపోతుంది. మేమే గెలిచాం అన్నీ అని ఏదైతే పొగరు ఉందో అది తగ్గాలి అంటూ ప్రేరణ చెప్పడం ఆశ్చర్యంగా మారింది. లేటెస్ట్ ప్రోమోలో ఓటమి తట్టుకోలేని నైజాం ప్రేరణలో స్పష్టంగా కనిపిస్తుంది.
05:49 PM (IST) Oct 24
ఈ సీజన్ మనదే అని, ఈ సారి విజేత మన ఆరుగురిలో ఒకరే ఉండాలని తెలిపారు నిఖిల్. తన ఓజీ క్లాన్‌కి ఆయన హితబోధ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
02:24 PM (IST) Oct 24
పట్టుకో కార్టులో పెట్టుకో టాస్క్ లో పెట్టుకో టాస్ రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ మధ్య హోరాహోరీ పోరు చోటు చేసుకుంది. కంటెస్టెంట్స్ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ టాస్క్ గొడవలకు కారణమైంది.
06:41 AM (IST) Oct 24
కంటెస్టెంట్ ప్రేరణ ఓటింగ్ లో దూసుకెళ్తుంది. ఆమె నిఖిల్, విష్ణుప్రియలను సైతం వెనక్కి నెట్టింది. తాజా ఓటింగ్ ప్రకారం ఆమె ముందంజలో ఉన్నారు. అనంతరం నిఖిల్, విష్ణుప్రియ ఉన్నారట. 8వ వారానికి ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్, పృథ్విరాజ్, నయని పావని, మెహబూబ్ నామినేటైన సంగతి తెలిసిందే.