యష్మిని నామినేట్ చేసిన హరితేజతో యష్మికి వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ ముగిశాక యష్మి కన్నీరు పెట్టుకుంది. ప్రేరణ ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె ఏడుపు ఆపలేదు.

06:02 PM (IST) Oct 15
టేస్టీ తేజను ఎలా నామినేట్ చేయాలో ఓ జీ సభ్యులతో నిఖిల్ ప్లాన్ చేశాడు. నిఖిల్ ప్లాన్ ని ఖచ్చితంగా అంచనా వేశాడు టేస్టీ తేజ. ఓజీ వర్సెస్ టేస్టీ తేజా అన్నట్లు గేమ్ మార్చేశారు. పర్లేదు మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతాను, అన్నాడు.
05:46 PM (IST) Oct 15
గౌతమ్-యష్మి మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కలదంటూ పుకార్లు వినిపిస్తుండగా, ఓ పరిణామం ప్రేక్షకులను ఆకర్షించింది. గౌతమ్ షర్ట్ ని యష్మి ధరించింది. సోషల్ మీడియాలో ఈ మేటర్ హాట్ టాపిక్ గా అయ్యింది.
05:34 PM (IST) Oct 15
పృథ్విరాజ్ ఎప్పటిలాగే నోరు జారాడు. అవినాష్ వైఫ్ ప్రస్తావన తెచ్చాడు. అలాగే 'రా' అని సంబోధించడంతో అవినాష్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
04:41 PM (IST) Oct 15
ఓన్లీ రివేంజ్ తీర్చుకునేందుకే ఓ కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తున్నానని చెప్పడం బిగ్ బాస్ కి నచ్చలేదు. అది సరికాదు. రివేంజ్ కోసం చేసే నామినేషన్ చెల్లదు, అన్నాడు. విష్ణుప్రియకు బిగ్ షాక్ తగిలింది.
10:26 AM (IST) Oct 15
నామినేషన్స్ డే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ వాతావరణం చోటు చేసుకుంటుంది. 7వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.
10:07 AM (IST) Oct 15
అవినాష్ తాను గెలుచుకున్న ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకుని నామినేషన్స్ నుండి మినహాయింపు పొందాడు. అదే సమయంలో ఒకరిని అవినాష్ స్వాప్ చేయాల్సి ఉండగా... హరితేజను చేశాడు. దానితో హరితేజ 7వ వారానికి నామినేట్ అయ్యింది. అవినాష్ సేవ్ అయ్యాడు.
06:46 AM (IST) Oct 15
నామినేషన్స్ లో యష్మికి హరితేజ చుక్కలు చూపించింది. యష్మిని నామినేట్ చేసిన హరితేజతో యష్మికి వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ ముగిశాక యష్మి కన్నీరు పెట్టుకుంది. ప్రేరణ ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె ఏడుపు ఆపలేదు.