Published : Sep 14, 2024, 06:47 AM IST

Boss Telugu 8 Live updates|Day 13: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్?

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. శుక్రవారంతో ఓటింగ్ ముగియగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నిఖిల్,  ఆసియానెట్ పోలింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

Boss Telugu 8 Live updates|Day 13: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్?

05:19 PM (IST) Sep 14

అడ్డంగా బుక్ అయిన యాష్మి, షూట్ చేసిన నాగార్జున!

చేసిన తప్పును చేయలేదని హోస్ట్ నాగార్జున ముందు అబద్ధమాడిన యాష్మి అడ్డంగా బుక్ అయ్యింది. వీడియో చూపించి మరీ ఆమె బండారం బయటపెట్టాడు నాగార్జున. చీఫ్ గా నువ్వు ఫెయిల్ అంటూ బోర్డు పై ఉన్న ఆమె ఫోటోను షూట్ చేశాడు. బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ ప్రోమో కాకరేపుతుంది. 
 

03:45 PM (IST) Sep 14

ప్రేరణ, నవీన్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారం కూడా పూర్తి కావస్తుంది. అప్పుడే వీకెండ్‌ వచ్చింది. ఈ శనివారం నాగార్జున సందడి చేయబోతున్నారు. కంటెస్టెంట్ల తప్పు, ఒప్పులను లెక్క వేయబోతున్నారు. తప్పు చేసిన వారికి వార్నింగ్‌ ఇవ్వనున్నాడు. అయితే ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా నాగ్‌.. ప్రేరణ, నవీన్‌లకు గట్టిగా క్లాస్‌ పీకబోతున్నాడట. విష్ణు ప్రియా విషయంలో వీళ్లు చేసిన పని పట్ల నాగ్‌ అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తుంది. 

03:28 PM (IST) Sep 14

ఆదిత్య ఓం గెలుపు కోసం ర్యాలీ, ఆత్మీయ సమావేశం

బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి కంటెస్టెంట్‌గా వచ్చిన హీరో ఆదిత్య ఓం ప్రారంభంలో డల్‌గా ఉండి, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడు. తనేంటో బయటపెడుతున్నాడు. ఈ వారం ఆయన నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఆయన గెలుపు కోసం సాధారణ ప్రజలు ర్యాలీలు నిర్వహించడం విశేషం. అంతేకాదు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. భదాద్రి, దుమ్ముగూడెం ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆదిత్య ఓం బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌గా నిలవాలని వాళ్లు కోరుకోవడం విశేషం. 

01:39 PM (IST) Sep 14

బిగ్ బాస్ హౌస్లోకి ఐదుగురు మాజీ కంటెస్టెంట్స్, ఇక దబిడి దిబిడే!

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 మంది మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి పంపుతున్నారట. గత సీజన్లో కంటెస్ట్ చేసిన హరితేజ, టేస్టీ తేజ, శోభ శెట్టి, ముక్కు అవినాష్, రోహిణి మరోసారి బిగ్ బాస్ షోలో సందడి చేయనున్నారనేది తాజా సమాచారం. సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. 

వైల్డ్ కార్డు ఎంట్రీలు ఊహించని విధంగా.. హౌస్లోకి మాజీ ఫైర్ బ్రాండ్స్, ఇది కదా ట్విస్ట్!

11:09 AM (IST) Sep 14

నాగార్జున వారిద్దరికీ వార్నింగ్ ఇస్తాడా లేదా?

బిగ్ బాస్ తెలుగు 8 సెకండ్ వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున నేడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ వారం హౌస్లో జరిగిన పరిణామాలు, కంటెస్టెంట్స్ ప్రవర్తన, పెర్ఫార్మన్స్ మీద రివ్యూ నిర్వహించనున్నాడు. కాగా సోనియా ఆకుల, యాష్మి గౌడ పరిధులు దాటి ప్రవర్తించారనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ముఖ్యంగా విష్ణుప్రియను సోనియా పర్సనల్ అటాక్ చేసిన నేపథ్యంలో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. 

ఆ కంటెస్టెంట్ విషయంలో నాగార్జున ఫైరా? ఫ్లవరా?, హోస్ట్ తీర్పు ఏమి కానుంది?

06:48 AM (IST) Sep 14

ఆ ఇద్దరిలో ఒకరు అవుట్?


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. శుక్రవారంతో ఓటింగ్ ముగియగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నిఖిల్,  ఆసియానెట్ పోలింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా? 

 

ఆ ఇద్దరిలో ఒకరు అవుట్?