ఫిజికల్ టాస్క్ లలో నిఖిల్ తీరు విమర్శల పాలవుతుంది. ఇతర కంటెస్టెంట్స్ పట్ల అతడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. గాయపరుస్తున్నాడు.

07:10 PM (IST) Nov 02
నామినేషన్స్ రోజు యష్మి-గౌతమ్ కి వాదన జరిగింది. ఈ క్రమంలో యష్మిని గౌతమ్ అక్క అన్నాడు. అక్క అనొద్దని గౌతమ్ పై యష్మి ఫైర్ అయ్యింది. అక్క అంటే తప్పేంటి అంటూ యష్మిని నాగార్జున సూటిగా అడిగాడు. క్రష్ అన్నవాడు అక్క అంటే నచ్చలేదని యష్మి సమాధానం చెప్పింది.
06:09 PM (IST) Nov 02
9వ వారానికి గాను యష్మి, గౌతమ్, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ నామినేట్ అయ్యారు. వీరిలో హరితేజ, నయని పావని డేంజర్ జోన్లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం నయని పావని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.
05:45 PM (IST) Nov 02
వీకెండ్ ఫస్ట్ ప్రోమో వచ్చేసింది. నాగార్జున వస్తూనే అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ప్రేరణ, నిఖిల్, గౌతమ్ లకు సీరియస్ గా క్లాస్ పీకాడు. టాస్క్ లలో వారు వాడిన పదాలు, బిహేవియర్ పై ఆయన అసహనం వ్యక్తం చేశాడు.
03:49 PM (IST) Nov 02
బిగ్ బాస్ హౌస్లో దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ బంతి భోజనాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
10:10 AM (IST) Nov 02
ఫుడ్ విషయంలో కంటెస్టెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. లిమిటెడ్ రేషన్ కి తోడు వంట చేసుకునేందుకు పరిమిత టైం ఇవ్వడంతో కంటెస్టెంట్స్ కడుపులు మాడుతున్నాయి. ఈ క్రమంలో రెండున్నర గంటల కుకింగ్ టైం అదనంగా బిగ్ బాస్ ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్స్ సంబరాలు చేసుకున్నారు.
06:47 AM (IST) Nov 02
ఫిజికల్ టాస్క్ లలో నిఖిల్ తీరు విమర్శల పాలవుతుంది. ఇతర కంటెస్టెంట్స్ పట్ల అతడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. గాయపరుస్తున్నాడు. నబీల్ ని కాలితో తన్నిన నిఖిల్ వీడియో వైరల్ అవుతుంది. నెటిజెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.