బాగా ఎంటర్‌టైన్ చేస్తాడని వైల్డ్ కార్ద్ ద్వారా టేస్టీ తేజని తీసుకురాగా, ఆయన వరస్ట్ ఆటగాడిగా మిగిలిపోయాడు. మెజారిటీ హౌజ్ ఆయన్ని వరస్ట్ హౌజ్‌మేట్‌గా తేల్చేశారు.

07:05 PM (IST) Nov 10
బిగ్ బాస్ తెలుగు 8 చివరి దశకి చేరుకుంటున్న తరుణంలో ప్రేక్షకులు ప్రీతి చిన్న అంశాన్ని గమనిస్తున్నారు. ప్రతి కంటెస్టెంట్ చేస్తున్న తప్పులు సోషల్ మీడియా వేదికగా బయట పెడుతున్నారు. నబీల్, ప్రేరణ ఇద్దరి విషయంలో కామన్ గా నెటిజన్లు ఒక విషయాన్ని గమనించారు. నబీల్ మెగా చీఫ్ అయ్యాక గేమ్ సరిగ్గా ఆడలేదు. ప్రేరణ కూడా చీఫ్ అయ్యాక వరస్ట్ గా పెర్ఫామ్ చేస్తోంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
04:05 PM (IST) Nov 10
బిగ్ బాస్ లో సరుకుల విషయంలో చేసిన దొంగతనం బయటపెట్టాడు బిగ్ బాస్. వీడియో చూపించి ఒక్కొక్కరి నిజ స్వరూపం బయటపెట్టాడు. దీంతో అంతా తప్పు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎవరెవరు ఏమేం దొంగతనం చేశారనేది చూస్తే..
04:00 PM (IST) Nov 10
బిగ్ బాస్ ఈ సండే ఫన్ డే వేరే లెవల్‌లో ఉండబోతుంది. అబ్బాయిలు అమ్మాయిలుగా, అమ్మాయిలు అబ్బాయిలుగా రచ్చ చేశారు. అయితే హీరో వరుణ్ తేజ్ మట్కా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేశారు. ఆయన ముందు తేజ,అవినాష్ డాన్సులతో ఇరగదీశారు.
03:56 PM (IST) Nov 10
బిగ్ బాస్ హౌజ్‌లో తార్ మార్ ప్రోగ్రామ్ పెట్టారు నాగార్జున. కంటెస్టెంట్లు అంతా అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా నటించాల్సి ఉంటుంది. ఇందులో తేజ, రోహిణి, అవినాష్, గౌతమ్ చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. యష్మిలా, ప్రేరణలా, నిఖిల్‌లా, విష్ణు ప్రియాలా యాక్ట్ చేసి, ఇమిటేషన్ చేసి మెప్పించారు.
08:35 AM (IST) Nov 10
టేస్టీ తేజ కోసం రోహిణి త్యాగం చేయడానికి సిద్ధమైంది. తేజకి ఫ్యామిలీ వీక్‌లో తన ఫ్యామిలీ వచ్చే అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో బాధపడుతున్న తేజని ఓదార్చింది రోహిణి. తన ఫ్యామిలీకి బదులు మీ ఫ్యామిలీని వచ్చే అవకాశం కల్పించాలని బిగ్ బాస్‌ని కోరబోతున్నట్టు వెల్లడించడం విశేషం.
07:18 AM (IST) Nov 10
నబీల్ నెమ్మదిగా తన ఆటతీరుతో పుంజుకుంటున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలుస్తున్నాడు. తాజాగా ఆయన మరో విన్నర్‌గా నిలిచాడు. ఎవిక్షన్ షీల్డ్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఆయన ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశాన్ని పొందాడు. తనే కాదు ఎవరినైనా సేవ్ చేసేందుకు కూడా దాన్ని ఉపయోగించవచ్చు.
07:10 AM (IST) Nov 10
టేస్టీ తేజకి పెద్ద షాక్ తగిలింది. ఆయనకు రెండు రకాలుగా షాక్‌లు తగిలాయి. ఒకటి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని హౌజ్ గెలుచుకోలేకపోయింది. ఇలా విఫలం కావడానికి టేస్టీ తేజనే కారణమని భావించిన నాగార్జున ఆయనకు పనీష్‌మెంట్ ఇచ్చాడు నాగ్. వచ్చే వారం మెగా చీఫ్ కంటెండర్‌గా పోటీ పడే అవకాశాన్ని కోల్పోయినట్టు తెలిపాడు. అంతేకాదు వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ విసయంలో ఎక్కువ ఓట్లు పడటంతో ఫ్యామిలీ వీక్‌లో తేజ ఫ్యామిలీ హౌజ్‌లోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయాడు. తన తల్లిని బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకురావాలనే ఆశయంతోనే హౌజ్‌లోకి వచ్చాడు తేజ. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ని కోల్పోయాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు తేజ. తన లక్ష్యమే అది, అని, కానీ ఇలా జరగడం బాధాకరమని ఎమోషనల్ అయ్యాడు తేజ.
నక్కలు, పిచ్చికుక్కలు ఓట్ చేస్తే టేస్టీ తేజని పనిష్ చేస్తారా? నాగార్జున, బిగ్ బాస్‌పై ట్రోల్స్