బిగ్ బాస్ తెలుగు 8 లైవ్ అప్ డేట్స్ డే 5 అప్ డేట్స్. బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ల వేడి తగ్గి టాస్క్ లపై ఫోకస్ పెట్టారు కంటెస్టెంట్లు. కానీ ఇందులో కొందరు కంటెస్టెంట్లు అసలు హౌజ్‌లో ఉన్నారా? అనే ఫీలింగ్‌ని తెప్పిస్తున్నారు.

05:59 PM (IST) Sep 06
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో శేఖర్ బాషా బాధితులు పెరిగిపోతున్నారు. ఆర్జేగా చేసిన శేఖర్ బాషా తన తెలుగు సందులతో ఇతర కంటెస్టెంట్లని ఆడుకుంటున్నారు. పదాలను విడిదీసి, కలిసి వాళ్లకి చుక్కలు చూపిస్తున్నాడు. కుళ్లు జోకులతో షాకిస్తున్నాడు. ముంబయి మా మేనమామ ఇళ్లు అన్నాడు. మమ్ బాయ్ అని ఇంగ్లీష్ వర్డ్స్ ని విడిదీసి అమ్మ, భాయ్ .. మేనమామ కదా అని చెప్పి ముంబాయిని మేనమామ ఇళ్లుని చేశాడు.
మరోవైపు పాము పుట్టకు ముందు చూస్తూ గతం ఏంటో తెలుస్తుందన్నారు. దాన్ని పుట్టక ముందు అంటూ విడదీసి మరోసారి షాకిచ్చాడు. ఇది అర్థం కాక యష్మి తలపట్టుకోవడం గమనార్హం. ఇలా తన కుళ్లు జోకులతో కంటెస్టెంట్లకి చుక్కలు చూపిస్తున్నాడు శేఖర్ బాషా. అంతకు మించి ఆయన హౌజ్‌లో పెద్దగా హైలైట్ అయ్యిన సందర్భం లేదు.
05:46 PM (IST) Sep 06
బిగ్ బాస్ తెలుగు 8 వ సీజన్‌లో మొదటి వారానికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా మారింది. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది తేలిపోయింది. ఆ కథేంటో ఇక్కడ చూడండి.
ఏషియానెట్ తెలుగు ఎక్స్ క్లూజివ్‌ః ఫస్ట్ వీక్ పక్కాగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే ?
01:06 PM (IST) Sep 06
తాజాగా శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రస్తుతం హౌస్ లో నైనికా, నిఖిల్, యాష్మి చీఫ్ లుగా ఉన్నారు. కంటెస్టెంట్స్ అంతా ఈ చీఫ్ లతో కలసి మూడు గ్రూపులుగా విడిపోయారు. యాష్మి గ్రూపు, నైనికా గ్రూపు మధ్య ఎవరు బలమైన వారు అనే విషయంలో టాక్స్ జరిగింది. అయితే నైనికా గ్రూపు వాళ్ళు రూల్స్ ఫాలో కాలేదని.. బాడీల మీదుగా రింగ్స్ పాస్ చేయలేదని వాదించారు. దీనితో యాష్మి గ్రూపుకి వ్యతిరేకంగా విష్ణుప్రియ, సీత, నైనికా గట్టిగా వాయిస్ రైజ్ చేశారు. తాము రూల్స్ ప్రకారమే టాస్క్ ఆడినట్లు తెలిపారు.
10:40 AM (IST) Sep 06
బగ్ బాస్ తెలుగు 8 శేఖర్ బాషా తన ఆర్జే తెలివిగా ఇతర కంటెస్టెంట్లకి చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా రాత్రి పూట మూడు ఎందుకు బాగా వస్తుందో తెలుసా? అంటూ ఇతర కంటెస్టెంట్లని ప్రశ్నించాడు. నిఖిల్ ఆయోమయంలో పడ్డాడు. పక్కనే ఉన్న యష్మి షాక్ అయ్యింది. దీనికి వివరణ ఇచ్చాడు శేఖర్ బాషా. `రాత్రి`ని రా.. త్రి(3)గా విభజించి చెప్పాడు. రా 3 అంటే ఎందుకు రాకుండా ఉంటుంది అంటూ కవర్ చేశారు. ఇది విన్న యష్మి వాక్ అంటూ చిరాకు పడటం నవ్వులు పూయించింది
07:56 AM (IST) Sep 06
బిగ్ బాస్ తెలుగు 8 లో కొందరు కంటెస్టెంట్లపై ట్రోల్స్ నడుస్తున్నాయి. డల్ గా ఉన్నవారిని ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఎందుకొచ్చావ్ బ్రో హౌజ్‌కి అంటూ రచ్చ చేస్తున్నారు. ఆ కథేంటో ఇక్కడ చూడండి.
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌కి ఎందుకొచ్చినట్టు? ఆదిత్య ఓం తోపాటు ఆ కంటెస్టెంట్లపై దారుణంగా ట్రోలింగ్
06:47 AM (IST) Sep 06
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో ప్రారంభం నుంచే కంటెస్టెంట్లపై విమర్శలు వచ్చాయి. పెద్దగా తెలియని మొహాలను తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే హౌజ్‌లో కొందరు కంటెస్టెంట్లు కనిపిస్తున్నారా? ప్రధానంగా ఆదిత్య ఓం పై ట్రోల్సర్స్ రచ్చ చేస్తున్నారు. నువ్వు అసలు హౌజ్‌లో ఉన్నావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయనతోపాటు వీక్‌కంటెస్టెంట్లని అప్పుడే కనిపెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో వాళ్లని దారుణంగా ఆడుకుంటున్నారు.
బిగ్ బాస్ పోల్‌ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?