బిగ్ బాస్ తెలుగు 8లో ఫస్ట్ టైమ్ కమ్యూనిటీ ప్రస్తావన వచ్చింది. ఇద్దరు కంటెస్టెంట్లు తమ కమ్యూనిటీ(మతం) గురించి మాట్లాడుకున్నారు. ఆ ఓట్లు మనకే పడతాయంటూ ఓపెన్‌గా చర్చించుకోవడం ఇప్పుడు రచ్చ అవుతుంది.

07:36 PM (IST) Oct 16
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్ భవిష్యత్‌లోకి వెళ్లిపోయింది. బిగ్ బాస్ ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఫోన్స్ గా రాయల్ క్లాన్స్, గార్డెన్ ఏరియాని తమ ఆధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఛార్జెస్‌గా ఓజీ క్లాన్ నిలవడం విశేషం. ఈ రెండు టీమ్‌లు ఛార్జెర్ సంపాదించడం కోసం పోరాడుతుంటారు. ఇందులో ఎవరు విన్ అయ్యారనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లతో లేటెస్ట్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు బిగ్ బాస్.
05:55 PM (IST) Oct 16
గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2.0 అంటూ వచ్చి పరువు పోగొట్టుకుంటున్నాడు. తన పసలేని గేమ్, వాదనలో కామెడీ అయిపోతున్నాడు.ఈ క్రమంలో ఆయన యష్మిని టార్గెట్ చేశాడు. ఆమెతో పులిహోర కలిపేందుకు బాగా ట్రై చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యష్మి కొంచెం స్పేస్ ఇవ్వరా అంటూ అరవడం హైలైట్‌గా నిలిచింది.
05:49 PM (IST) Oct 16
మెహబూబ్, నబీల్ ల మధ్య కమ్యూనిటీ ప్రస్తావన రావడమే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయ్యింది. దీన్ని నెటిజన్లు, ఆడియెన్స్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి గేమ్ ఆడుతుండటం విశేషం. నబీల్‌కి మెగా చీఫ్ అయిన మెహబూబ్ సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అంతేకాదు గేమ్ కి సంబంధించిన కొన్ని సూచనలను వెల్లడించారు. ఎలా సపోర్ట్ చేస్తానో, ఎప్పుడు గేమ్ ఎలా ఆడాలో కూడా చెప్పాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది.
05:47 PM (IST) Oct 16
మణికంఠ ప్రారంభం నుంచి సింపతీ గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అతను ఫిజికల్ గా వీక్ గా ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. తాను కూడా అలానే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఆ మాట చెబితే మాత్రం ఫైర్ అవుతున్నాడు. తాజాగా తాను ఫిజికల్ గా వీక్ అని ఒప్పుకున్నాడు. తాను అలా చేయాల్సి వస్తే చేయలేనని వెల్లడించాడు.
12:52 PM (IST) Oct 16
విష్ణుప్రియ గంగవ్వతో మాట్లాడుతూ తన ఫ్యామిలీ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది. విష్ణు ప్రియని గంగవ్వ.. మీ నాన్న ఎక్కడ ఉంటాడు.. ఎం చేస్తుంటాడు.. మీకు అండగా ఉండడా అని ప్రశ్నించింది. దీనికి విష్ణుప్రియ బదులిస్తూ నాన్న ఊర్లో ఉంటారు. మా అమ్మకి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు. మా నాన్నపై నాకు ప్రేమ ఉన్నప్పటికీ అమ్మ కోసం ఆయన్ని దూరం పెట్టా అని ఎమోషనల్ గా చెప్పింది. విష్ణుప్రియ మాటలకు గంగవ్వ కంటతడి పెట్టుకుంది. దీనితో విష్ణుప్రియ గంగవ్వని ఓదార్చింది.
10:57 AM (IST) Oct 16
బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం 45 ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మణికంఠ వేసే పోప్ మామూలుగా లేదు. తాను సేవ్ అయితే గంగవ్వకి ముక్కుపుడక, హరితేజకి వడ్డానం, అలాగే రోహిణికి ముద్దు ఇస్తానని తెలిపారు. ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది.
06:57 AM (IST) Oct 16
బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం రన్ అవుతుంది. 15 మందితో హౌజ్ రన్ అవుతుంది. ఈ వారం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగని బ్లండర్ జరిగింది. కమ్యూనిటీ(మతం) ఓట్ల గురించి చర్చించుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అవుతుంది. నబీల్, మెహబూబ్‌లను ట్రోల్ చేస్తున్నారు. కులాలు, మతాలు, సంఘాలు, ప్రాంతాలకు అతీతంగా షో రన్ అవుతుందని డిస్‌క్లెయిమర్‌లో పేర్కొండి బిగ్ బాస్ టీమ్. కానీ ఇద్దరు కంటెస్టెంట్లు తమ మతం ఓట్లు తమకు పడతాయంటూ మాట్లాడుకోవడం షాకిస్తుంది.