సౌత్ లో హీరో, డైరెక్టర్, నిర్మాత ముగ్గురికీ ఆ విషయంలో ఓకె చెప్పాలి.. లేకుంటే, నటి సంచలన వ్యాఖ్యలు

Published : Jul 22, 2023, 03:43 PM IST
సౌత్ లో హీరో, డైరెక్టర్, నిర్మాత ముగ్గురికీ ఆ విషయంలో ఓకె చెప్పాలి.. లేకుంటే, నటి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

చిత్ర పరిశ్రమలో నటిగా ఎదిగేందుకు అనేక అడ్డంకులు ఉంటాయి. గత కొన్నేళ్లుగా చాలా మంది హీరోయిన్లు, నటీమణులు కాస్టింగ్ కౌచ్ విషయంలో పలు ఆరోపణలు చేస్తున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలని పంచుకుంటున్నారు.

చిత్ర పరిశ్రమలో నటిగా ఎదిగేందుకు అనేక అడ్డంకులు ఉంటాయి. గత కొన్నేళ్లుగా చాలా మంది హీరోయిన్లు, నటీమణులు కాస్టింగ్ కౌచ్ విషయంలో పలు ఆరోపణలు చేస్తున్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాలని పంచుకుంటున్నారు. తాజాగా హిందీ బుల్లితెర నటి రతన్ రాజ్ పుత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆమె తనకి ఎదురైన సంఘటనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 

సౌత్ లో నటిగా అవకాశం పొందాలంటే హీరో, డైరెక్టర్, నిర్మాత ముగ్గురితో ఆ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిందే అని బాంబు పేల్చారు రతన్ రాజ్ పుత్. సౌత్ లో నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు మంచి దర్శకులు ఉన్నారు. కానీ మరికొందరు బిహేవియర్ ఇబ్బందికరంగా ఉండేది. నేను హిందీలో 'అగ్లే జనం మోహే బిటియ హి కిజో ' అనే సీరియల్ లో నటిస్తున్నప్పుడు సౌత్ నుంచి అవకాశాలు వచ్చేవి. 

ఒకరు నాకు ఫోన్ చేసి ఓ అవకాశం ఉందని చెప్పారు. అయితే మీరు బాగా సన్నబడ్డాడు. ఈ పాత్ర కోసం కాస్త బరువు పెరిగితే బావుంటుంది అని చెప్పారు. ఆయన కండిషన్ కి ఓకె చెప్పాను. వెంటనే మిగిలిన కండిషన్స్ కూడా తెలుసు కదా అని అన్నాడు. ఏంటా కండిషన్స్ అని అడిగాను. హీరో, దర్శకుడు, నిర్మాత అలాగే సినిమాటోగ్రాఫర్ ఎవరడిగినా కాదనకూడదు అంటూ పరోక్షంగా చెప్పాడు. 

అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని గట్టిగా అడిగాను. మీకు తెలిసిందే కాదా.. వాళ్ళతో కాంప్రమైజ్ కావలసి ఉంటుంది అని నేరుగా అడిగేశాడు. అంతే వెంటనే ఆ ఆఫర్ ని రిజక్ట్ చేశాను. ఆ  తర్వాత సౌత్ లో నాకు ఆఫర్స్ రాలేదు అని రతన్ రాజ్ పుత్ తెలిపింది. ముంబైలో కూడా ఆడిషన్స్ లో ఒకసారి మత్తుమందు కలిపి లోబరుచుకోవాలని ప్రయత్నించారని.. కానీ అక్కడి నుంచి ఎలాగో బయటపడ్డానని రతన్ పేర్కొన్నారు. కూల్ డ్రింక్ తేడాగా అనిపించింది. వాళ్ళు రమ్మని పిలిచిన ప్రదేశం చెత్తగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయా అని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం