మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్, టన్నెల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Published : Sep 04, 2025, 09:17 PM IST
Tunnel Trailer

సారాంశం

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భవతి. ఆమె నటించిన చిత్రం ఈ టైంలో రిలీజ్ అవుతుండడంతో 'టన్నెల్' పై ఆసక్తి నెలకొంది. టన్నెల్ ట్రైలర్ లో విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.   

‘టన్నెల్’ అనే కొత్త యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ట్రైలర్‌లో క్రైమ్, ఫాదర్-సన్ రిలేషన్ లోని ఉత్కంఠ, డ్రామా,రొమాన్స్ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి . ఈ చిత్రంలో హీరోగా అథర్వ మురళీ నటిస్తుండగా, హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి కనిపించనున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భవతి. ఆమె నటించిన చిత్రం ఈ టైంలో రిలీజ్ అవుతుండడంతో 'టన్నెల్' పై ఆసక్తి నెలకొంది. 

లాచురాం ప్రొడక్షన్స్ అధినేత రాజు నాయక్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.హీరోగా కనిపించే అథర్వ మురళీ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఒక మాజీ సైనికుడిగా కనిపించే అశ్విన్ కకుమాను పాత్రతో ఆయన ఘర్షణకు దిగుతారు. “యూనిఫామ్ ధరించే ప్రతి ఒక్కరికీ చుట్టూ ఉన్నవారంతా కుటుంబమే,” అని హీరో చెప్పే డైలాగ్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మేకర్స్ షేర్ చేసిన ట్రైలర్‌లో, “ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో యాక్షన్, థ్రిల్ అనుభవించండి” అనే లైన్ ప్రత్యేకంగా హైలైట్ చేశారు. 

కథలో ఎక్కువ భాగం రాత్రివేళల్లోనే సాగుతుంది. హీరో-విలన్ మధ్య జరిగే క్యాట్-అండ్-మౌస్ గేమ్ ఉత్కంఠభరితంగా, ఉనికిని పరీక్షించే విధంగా సాగుతుందని ట్రైలర్ సూచిస్తోంది.ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించారు. ఆయన ‘రాధే శ్యామ్’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

‘టన్నెల్’ క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రాబోతున్నందున, ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కి ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. అథర్వ మురళీ యాక్షన్ లుక్, లావణ్య త్రిపాఠి గ్లామర్, అలాగే కథలోని ఉత్కంఠభరిత ఎపిసోడ్స్ సినిమాపై మరింత కరెంట్ పెంచుతున్నాయి.సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగిన స్థాయిలో ఉంటుందా అన్నది చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో