విజయ్ దేవరకొండ డైలాగ్ పై ట్రోలింగ్, దీనిని కూడా పబ్లిసిటీకి వాడేస్తున్నారుగా.. రౌడీ హీరో రియాక్షన్

Published : Oct 26, 2023, 04:50 PM IST
విజయ్ దేవరకొండ డైలాగ్ పై ట్రోలింగ్, దీనిని కూడా పబ్లిసిటీకి వాడేస్తున్నారుగా.. రౌడీ హీరో రియాక్షన్

సారాంశం

ఖుషి తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలలో పరశురామ్ దర్శకత్వంలోని మూవీ ఒకటి. రీసెంట్ గా ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. 

ఖుషి తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలలో పరశురామ్ దర్శకత్వంలోని మూవీ ఒకటి. రీసెంట్ గా ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండని యాక్షన్ మోడ్ లో చూపిస్తూ పరశురామ్ మరో ఫ్యామిలీ డ్రామా తెరక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

కుటుంబంలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి సెటిల్మెంట్స్ కి దిగితే ఎలా ఉంటుందో అని విజయ్ దేవరకొండ రూపంలో పరశురామ్ ఈ చిత్రంలో చూపిస్తున్నాడు. విజయ్ దేవకొండ కామన్ మాన్ తరహాలో ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. 

విజయ్ దేవరకొండ చిత్రం అనగానే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సాఫీగా ఉండదు. ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కాల్సిందే. ఫ్యామిలీ స్టార్ చిత్ర టీజర్ లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. విలన్స్ కి విజయ్ వార్నింగ్ ఇస్తూ.. 'ఐరనే వంచాలా ఏంటి' అంటూ ఐరన్ రాడ్ ని వంచుతాడు. కానీ విజయ్ చెప్పిన విధానం జనాల్లోకి డిఫరెంట్ టోన్ లో వెళ్ళింది. 

దీనితో నెటిజన్లు 'Iron ye vanchala enti' అని కాకుండా 'Airane vanchala enti' అనే హ్యాష్ ట్యాగ్ తో దారుణంగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టీజర్ ఐరన్ రాడ్ యాడ్ లా ఉందని కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు ఆ డైలాగ్ డెలివరీ ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

మొత్తంగా ఫ్యామిలీ స్టార్ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే దీనిని కూడా విజయ్ దేవరకొండ పబ్లిసిటీకి వాడేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ మిర్చి చిత్రంలో డైలాగ్స్ తో విజయ్ దేవరకొండ డైలాగ్ ని సింక్ చేస్తూ చేసిన మీమ్ వీడియోపై విజయ్ దేవరకొండ పోస్ట్ చేశాడు. ఇంటర్నెట్ లో అసలు ఏం నడుస్తోంది అంటూ విజయ్ పోస్ట్ చేయడం విశేషం. అలాగే నిర్మాణ సంస్థ కూడా ఈ ట్రోలింగ్ ని తమకి అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?