Trivikram-Pooja Hegde:ఇక బుట్టబొమ్మను వదలరా త్రివిక్రమ్?.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్స్!

Published : Feb 04, 2022, 10:10 AM ISTUpdated : Feb 04, 2022, 11:09 AM IST
Trivikram-Pooja Hegde:ఇక బుట్టబొమ్మను వదలరా త్రివిక్రమ్?.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్స్!

సారాంశం

వరుసగా మూడు చిత్రానికి పూజా హెగ్డేను లాక్ చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్. మహేష్ 28వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో వరుస సెటైర్స్ పేలుతున్నాయి. 

పరిశ్రమలో కాంబినేషన్ సెంటిమెంట్స్  చాలా ఎక్కువ.దర్శక నిర్మాతలు హిట్ కాంబినేషన్ రిపీట్ చేయడానికి ఇష్టపడతారు. హీరో-హీరోయిన్, హీరో-డైరెక్టర్, డైరెక్టర్-హీరోయిన్ ఇలా ఒకసారి హిట్ అందుకున్న కాంబినేషన్ లో మూవీ చేయడానికి ఇష్టపడతారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ ఇదే ఫాలో అవుతున్నారు. అజ్ఞాతవాసి మూవీ త్రివిక్రమ్ ఇమేజ్ ని భారీగా దెబ్బ తీసింది. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కి తెలుగు నేటివిటీ టచ్ ఇచ్చి అజ్ఞాతవాసి చిత్రం చేశారు. అప్పట్లో లార్గో వించ్ మేకర్స్ నానా రాద్ధాంతం చేశారు. నిజానికి లార్గో వించ్ అక్కడ పెద్ద హిట్ మూవీ కూడా కాదు. ఇక తెలుగులో ఈ మూవీ ఫలితం మనందరికీ తెలిసిందే. 

అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తర్వాత ఎన్టీఆర్ (NTR)తో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేసి విజయం సాధించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అప్పటికి పూజాకు సరైన హిట్ పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ఫెయిల్యూర్స్ లో ఉంది. అయినప్పటికీ బుట్టబొమ్మపై నమ్మకం ఉంచి ఆమెను తీసుకున్నారు. అరవింద సమేత హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ విజయం సాధించకున్నా... ఓకె అనిపించుకుంది. ఆమె యాక్టింగ్ కొంచెం అటూ ఇటుగా ఉన్నా.. గ్లామర్ కి మంచి మార్కులు పడ్డాయి. 

అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అనుకున్న త్రివిక్రమ్(Trivikram) పూజా హెగ్డేను రిపీట్ చేశారు. త్రివిక్రమ్-పూజా కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అల వైకుంఠపురంలో 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పూజాను త్రివిక్రమ్ తన హిట్ సెంటిమెంట్ గా బావిస్తున్నారేమో తెలియదు కానీ.. మహేష్ సినిమాకు మరలా ఆమెనే తీసుకున్నారు. మహేష్ 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు పూజా హెగ్డే కూడా హాజరయ్యారు. 

కాబట్టి త్రివిక్రమ్-పూజాలకు(Pooja hegde) ఇది హ్యాట్రిక్ మూవీ. ముచ్చటగా మూడోసారి.... అది కూడా వరుసగా పూజా హెగ్డేను తన చిత్రాలకు హీరోయిన్ గా పూజాను తీసుకున్నారు. మహేష్ తో త్రివిక్రమ్ కి కూడా ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. దశాబ్దం తర్వాత ఇద్దరూ కలిసి మూవీ చేస్తున్నారు. 

ఇక త్రివిక్రమ్ మూడో చిత్రానికి కూడా పూజాను ఎంచుకోవడం పై సోషల్ మీడియాలో కామెంట్స్, సెటైర్స్ పేలుతున్నాయి. ఏంటి త్రివిక్రమ్ మీరు బుట్ట బొమ్మ పూజా హెగ్డేను వదలరా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే మహేష్ (Mahesh babu)పక్కన పూజా నటించడాన్ని ఆహ్వానిస్తుంటే, మరి కొందరు కొత్తదనం కోరుకుంటున్నారు. వరుసగా మూడు చిత్రాలకు ఒక దర్శకుడు సేమ్ హీరోయిన్ ని రిపీట్ చేయడం... ఈ రోజుల్లో కొత్తే అని చెప్పాలి. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు