జెర్సి: త్రివిక్రమ్, దిల్ రాజు చూసి క్లైమాక్స్ ఫైనల్

By Udaya DFirst Published Mar 6, 2019, 9:46 AM IST
Highlights

ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైన  విషయాలపై ఓ నిర్ణయానికి రాలేనప్పుడు సాధారణంగా మన సీనియర్స్ ని సలహా అడుగుతూంటాం. వాళ్లు తమ అనుభవాలతో సలహాలు ఇస్తూంటారు. 

ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైన  విషయాలపై ఓ నిర్ణయానికి రాలేనప్పుడు సాధారణంగా మన సీనియర్స్ ని సలహా అడుగుతూంటాం. వాళ్లు తమ అనుభవాలతో సలహాలు ఇస్తూంటారు. వాటిని పాటిస్తూంటారు. ఇప్పుడు అదే పని చేయబోతోంది నాని హీరోగా రూపొందుతున్న జెర్సి టీమ్. 

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళి రావాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జెర్సి.  ఈ సినిమా క్లైమాక్స్ గురించి గత కొద్ది రోజులుగా టీమ్ రకరకాల ఆలోచలు చేస్తోందిట. ఇప్పటికే ఒక సుఖాంతం, మరొకటి కథ ప్రకారం విషాదాంతం క్లైమాక్స్ షూట్ చేసారట. సినిమాకు ఈ రెండు టైటిల్స్ లో ఏది సెట్ అవుతుందనేది దిల్ రాజు, త్రివిక్రమ్ ని పిలిచి షో చూపించి వారి సలహాతో ఫైనల్ చేస్తారని సమాచారం. 

ఇక ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.  కథ  ప్రకారం  80-90 దశకం మధ్య జరిగిన కథ ఇది.   36 ఏళ్ళ వయసులో కొత్తగా ఏమీ చేయడానికి లేని ఒక యువకుడు 1996-97 రంజీ ట్రోఫీ ద్వారా ప్రూవ్ చేసుకుని తానేంటో మళ్ళి ప్రపంచానికి చాటాడమే కీలకాంశం.  జెర్సిలో నాని  పాత్ర పేరు అర్జున్  . అప్పట్లో సంచలన స్టార్ గా పేరున్న రమణ్ లాంబా జీవత కథగా ఈ సినిమా రూపొందుతోందని టాక్. 

click me!