ప్రేమికుల రోజున శ్రీదేవి వర్ధంతి.. ఆమెకి నచ్చిన స్థలంలోనే!

Published : Feb 09, 2019, 03:44 PM IST
ప్రేమికుల రోజున శ్రీదేవి వర్ధంతి.. ఆమెకి నచ్చిన స్థలంలోనే!

సారాంశం

వెండితెరపై తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా చెరగని ముద్ర వేసింది. గతేడాది పెళ్లి కోసమని దుబాయ్ కి వెళ్లిన ఆమె హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయింది. 

ఇప్పటికీ ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరి 24, 2018లో ఆమె మరణించారు. తిథుల ప్రకారం ఆమె వర్ధంతి ఫిబ్రవరి 14న వచ్చిందని బోనీకపూర్  కుటుంబం తెలిపినట్లు సమాచారం. ఈ కార్యక్రమాలను శ్రీదేవికి నచ్చిన స్థలంలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. 

శ్రీదేవికి చెన్నైలో తన ఇల్లు అంటే చాలా ఇష్టమట. కాబట్టి అక్కడే తొలి వర్ధంతిని జరపాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆరోజు నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొనున్నారని సమాచారం.  

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ