
స్టార్స్ సందడి సంక్రాంతితో ముగిసింది. దాంతో ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు అవీ కంటెంట్ ని నమ్మి చేసినవి రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈవారం మూడు సినిమాలు ప్రధానంగా భాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. ఈ మూడింటిలో ఒకటి డైరక్ట్ తెలుగు,రెండోది రీమేక్ , మూడోది బైలింగ్వుల్.
ఈ సినిమాలో కాస్త ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ‘రైటర్ పద్మభూషణ్’పై ఎక్కువ మంది దృష్టి ఉంది. కమెడియన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సుహాస్ ‘కలర్ ఫొటో’ తో హీరో అయ్యారు. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన ఛాయ్ బిస్కెట్ సంస్థ అధినేతలు అనురాగ్ రెడ్డి-శరత్ చంద్రల నిర్మాణంలో షణ్ముఖ ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో సుహాస్ చేసిన చిత్రమిది. ఈ సినిమా చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రిలీజ్ డే కంటే ఒక రోజు ముందే గురువారం రాత్రి ఈ చిత్రానికి ప్రిమియర్లు వేస్తున్నారు. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని టీం నమ్మకంతో ఉంది.
ఇక శుక్రవారం సందీప్ కిషన్ సినిమా ‘మైకేల్’ మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా సినిమా ఇది. దీనికి రంజిత్ జయకోడి (Ranjith Jayakodi) దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), గౌతమ్ మీనన్ (Gautam Menon), వరుణ్ సందేశ్ (Varun Sandesh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈమధ్య విడుదలైన టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా వున్నాయి. మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదల అవుతోంది.
అలాగే ఈ వారం రిలీజ్ అవుతున్న మరో సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కప్పెలా’కు ఇది రీమేక్. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ (Shourie Chandrasekhar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం ‘కంటెంట్’ను నమ్ముకుని థియోటర్ లో దిగుతున్న ఈ మూడు చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.